పోటీ లేక పదో.. పాతికో రాకుండా పోయాయా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక ఆ జిల్లాలోని లోకల్ బాడీ ఓటర్ల ఆశలపై నీళ్లు చల్లిందా? ఇతర జిల్లాల్లోని క్యాంపులు ఈర్ష్యగా మారాయా? పోటీ లేకపోవడంతో పదో.. పాతికో రాకుండా పోయాయని వాపోతున్నారా? వాళ్ల నారాజ్‌కు కారణం ఇదేనా?
పోటీ ఉంటే పదో.. పరకో వస్తుందని ఆశించారట..!
Also Read
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండుకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు పోటీలేకుండా ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గులాబీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఓటర్లయిన.. ఎంపీటీసీ.. జడ్పీటీసీ… కౌన్సిలర్లు మాత్రం నారాజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్.. బీజేపీలు పోటీలో లేకపోవడం, స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించి విత్‌డ్రా చేయించేశారు. దీంతో పదో.. పరకో వస్తుందనుకున్న ఓటర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తమకు డిమాండ్ పెరగకపోగా.. పలకరించే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారట.
క్యాంపుల్లో ఓటర్ల రాజభోగాలు చూసి ఈర్ష్య..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటి ఉన్నచోట నడుస్తున్న క్యాంప్ రాజకీయాలు.. గోవా, బెంగుళూరుల్లో వారు చేస్తున్న హంగామా వీడియోలు చూసి.. తమకా అదృష్టం లేదని ఫీలవుతున్నారట. ఇక్కడ కూడా పోటీ ఉండి ఉంటే గోవా, బెంగళూరు కాకపోయినా.. ఏదో ఒక ఆలయానికి వెళ్లేవాళ్లమని ఎంపీటీసీ సర్కిళ్లలో చర్చ జరుగుతోందట. జిల్లాలో మొత్తం 1445 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మూడొంతుల మంది అధికారపార్టీకి చెందినవాళ్లే. ఎంపీటీసీలే సింహభాగం. విధులు, నిధులు లేవని తీవ్ర అసంతృప్తితో ఉన్నారంతా. ఈ దఫా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ డిమాండ్లను ముందుపెట్టి.. తమలో ఒకరిని బరిలో నిలిపేందుకు ప్లాన్ చేసుకున్నారు. విషయం పసిగట్టిన ఎమ్మెల్యేలు.. వారిని నిలువరించారు. పార్టీ చెప్పినట్టు నడుచుకోవాలని తలంటేశారట. అయితే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో తమకొచ్చే చారానో.. బారానో రాకుండా పోయాయని ఎమ్మెల్యేలకు చెప్పి బాధపడినట్టు తెలుస్తోంది.
ఉడతా భక్తిగా ఏదైనా చేయడానికి ఎమ్మెల్సీలు ససేమిరా..!
ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఉడతా భక్తిగా ఏదైనా చేద్దామని ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి లైట్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో తమ పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏం సమాధానం చెప్పాలో తెలియని సంకట స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న ఎంపీటీసీలు.. ఇతర ఓటర్లు.. ఎమ్మెల్సీలపై గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. తమ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వాళ్లు ముఖం చాటేయడంపై నిప్పులు చెరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ సెగలను ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎలా చల్లారుస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?