తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. ఒక్క మనిషి కూడా మిగులకుండా ప్రతీ ఒక్కరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని సూచించారు. బుధవారం బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ని ప్రతీ గ్రామం ఏదీ వదలకుండా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. వందకు వంద శాతం మొదటి డోస్, రెండో…
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగు లో గల్లంతయ్యి మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించి భవిష్యత్తులో అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక్కొక్క బాధితు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించారు మంత్రి కేటీఆర్. వర్కర్స్ టూ ఓనర్ పథకం కింద శ్రీరాము, క్రాంతి కుమార్…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ హంతకుడంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడండంటూ ఫైర్ అయ్యారు. ఇంకెంత మందిని బలితీసుకొంటే నోటిఫికేషన్లు ఇస్తారు దొరా? మీకు కనికరం లేదు, కనీసం చీమ పారినట్టు కూడా లేదంటూ ఓ రేంజ్ లో సీఎం…
నిన్న టీఆర్ఎస్ భవన్ లో చెప్పిన విధంగానే… దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ లో కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్. 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కూడా ఈ లేఖ లో డిమాండ్ చేశారు కేసీఆర్. 40 లక్షల…
రేపు ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఇందిరాపార్క్ ధర్నాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నిరసన వ్యక్తం చేశామన్నారు. పంజాబ్‌లో ధాన్యం కొను గోలు చేస్తారు.. తెలంగాణలో ఎందుకు కొనరంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటుందన్నారు. రాష్ర్టానికి ఒక విధానం ఉండకూడదా..? కేంద్రంపై ఒత్తిడి పెంచేం దుకు ఇందిరా…
బోదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం సంతోషకరం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడున్నర ఏళ్లలోనే రామప్పకు- పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉంది. నిజాం ప్రభుత్వంలో అగ్గిపెట్టలో చీరను నేచిన ఘనత బోధాన్ పోచంపల్లిది. మేము చేసే ప్రయత్నాలకు ఫలితాలు వస్తే ముందుగా గుర్తింపు ఇండియాకు వస్తది. త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతోంది. ఇక అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఒక్కో రాష్ట్రాన్ని…
బాటసింగారం, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ సమస్యపై అడ్వకేట్ కమిషనర్‌ను నియమించింది తెలంగాణ హైకోర్టు.. ఆ రెండు ఫ్రూట్ మార్కెట్లను సందర్శించాలని అడ్వకేట్ కమిషనర్‌ను ఆదేశించింది.. ఫ్రూట్ మార్కెట్ ను సందర్శించి నివేదికను నవంబర్ 19లోగా హైకోర్టు సమర్పించాలని పేర్కొంది.. అయితే, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరఫు న్యాయవాది.. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ బలవంతంగా గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారని కోర్టుకు విన్నవించారు.. ఇక, ప్రభుత్వం…
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పార్టీని వెంటాడుతాం… వేటాడుతామని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. తాము ఉద్యమ కారులమని…కేంద్రంపై కొట్లాడటంపై కొత్తేమీ కాదన్నారు కేసీఆర్. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని… ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రశ్నిస్తే…కేంద్రం ఉలుకు లేదు…పలుకు లేకుండా వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలు…
ధాన్యం కొనుగోలు అంశం పై అధికారు టీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి హైదరాబాద్ మహా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై నిరసన గా ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేయాలని నిర్నయం తీసుకుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇక ఈ మహా ధర్నా లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కూడా స్వయంగా…
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.. ధన్యాం కొనుగోళ్ల విషయంలో.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. రైతుల తరపున పోరాటం చేస్తామని ప్రకటించిన ఆయన.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని బీజేపీ నేతలను టార్గెట్ చేశారు కేసీఆర్.. ఇక, తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు సీఎం కేసీఆర్.. లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..