తెలంగాణ పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతే బాగుండని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఇవాళ ఇందిరా పార్క్ లో నిర్వహించిన మహా ధర్నా లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… బీజేపీ మాట్లాడితే అబద్దాలని… అబద్దాలు మాట్లాడుతూ.. అడ్డగోలు పాలన చేస్తోందని ఫైర్ అయ్యారు. ఏడాదిగా ఢిల్లీ లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని……
రైతులు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారింది పరిస్థితి… రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్న ఆ పార్టీ నేతలు.. కేంద్రం చెప్పేది ఒకటైతే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మరో మార్గం ద్వారా రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.. ఇక కేంద్రంపై యుద్ధం ప్రకటించి మహాధర్నాకు దిగారు గులాబీ పార్టీ దళపతి కేసీఆర్.. అయితే.. ఈ ధర్నాపై కాంగ్రెస్ పార్టీ…
నిధులు కేంద్రానివి, ఫోటోలు కేసీఆర్ వి అని… ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి తెలంగాణ లో లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అనంతరం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినంద సభ లో ఈటల రాజేందర్ ను సన్మానించారు నేతలు,…
గత పది రోజుల నుంచి ధాన్యం కోనుగోలు అంశంపై అధికార టీఆర్ఎస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూంటే.. తెలంగాణ బీజేపీ మాత్రం… కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ డ్రామాలు ఆడుతుందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్రం తీరుకు నిరసనగా.. ఇవాళ ఇందిరా పార్క్ లో టీఆర్ఎస్ మహా ధర్నా చేస్తోంది. అయితే…ఈ మహా ధర్నాలో ఓ అరుదైన సంఘటన చోటు…
ధాన్యం కొనుగోలు అంశం నేపథ్యంలో కేంద్రంపై యుద్ధం ఇక ఆగబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే.. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న మహా ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని… కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగామని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉధృతం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పంజాబ్ లో కొన్నట్లు ఇక్కడ…
సాధారణంగా బయట ఏ4 సైజు పేపర్‌ను వాడితే.. కోర్టులు, రిజిస్ట్రేషన్ కార్యాలయలు.. ఇతర కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఏ4 కంటే కాస్త పొడవైన పేపర్లు వాడుతుంటారు.. అయితే, హైకోర్టులో ఏ4 సైజు పేపర్‌ను ఉపయోగించడంపై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది.. తెలంగాణ హైకోర్టు మరియు అన్ని సబార్డినేట్ కోర్టులలో అన్ని న్యాయపరమైన ప్రయోజనాల కోసం రెండు వైపులా రాసిన ఏ4 సైజు పేపర్లను మాత్రమే ఉపయోగించాలంటూ మయూర్ ముంద్రా అనే న్యాయవాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు..…
కరోనా కారణంగా నల్లమల అడవిలో టైగర్ సఫారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 17 వ తేదీ నుంచి టైగర్ సఫారీని తిరిగి ప్రారంభించారు. కరోనా కారణంగా గత ఏడాదిన్నర నుంచి ఎక్కడికి వెళ్లలేక ఏదైనా కొత్త ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి నల్లమల టైగర్ సఫారి ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం అవసరం లేదు. Read: ఆ రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత… ట్రెక్కింగ్ తోపాటుగా వన్యప్రాణులు, వన్యమృగాలను సందర్శించేందుకు వీలు కలుగుతుంది. హైదరాబాద్…
వంటింట్లో టమాటా ఉండాల్సిందే..! ప్రతీ కూరలోనూ టమాటా వాడాల్సిందే..! అప్పుడే ఆ కూరకు టెస్ట్ వస్తుంది.. కానీ, ఇప్పుడు టమాటా దొరకడమే కష్టంగా మారే పరిస్థితి కనిపనిస్తోంది.. ఎందుకంటే.. ఎప్పుడూ మార్కెట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చే టమాటా ఇప్పుడు కనిపించడంలేదు.. మార్కెట్లు, రైతు బజారుల్లోనూ టమాటా జాడ కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు.. టమాటా ధర క్రమంగా పైకి కదులుతోంది.. దీంతో.. సూపర్ మార్కెట్లు నేరుగా రైతు దగ్గరకే వెళ్లి టమాటాలు కొనేస్తున్నారు. క్రమంగా సూపర్…
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి.. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.. హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టు రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు.. ప్రకాశం జిల్లాలో విరసం నేత కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.. మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కొనసాగిన కళ్యాణ్ రావు ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. ఇక, విశాఖపట్నంలోని అనురాధ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతేకాదు,…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.. రోడ్డు ప్రమాదానికి గురై రాత్రి సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి బాసటగా నిలిచారు.. తన కాన్వాయ్‌లోనే ఆస్పత్రికి తరలించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి సమయంలో మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు.. హకీంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. గాయాలపాలై సాయం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో.. అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్.. ఆ దృశ్యాలను గమనించారు.. వెంటనే కాన్వాయ్‌ని ఆపి కిందికి దిగారు.. విద్యార్థులను…