తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల పైనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరి రైతాంగాన్ని ఇబ్బంది పెరుగుతుంది అని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం సమగ్ర విధానం ప్రకటించాలి అని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం పోరాడేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఈ విషయంపై కేంద్రాన్ని పార్లమెంటు వేదికగా నిలదీస్తాం అని చెప్పారు. ఉభయసభల్లోనూ మా ఎంపీలు గళమెత్తారు అని అన్న…
పల్లె దవాఖానలు నాలుగు వేలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. పల్లె దవాఖానలతో గ్రామీణుల చెంతనే నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 5 మెడికల్ కాలేజీలను 17కు పెంచుకుంటున్నాము అని చెప్పారు. పీజీ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లను గణనీయంగా పెంచుకున్నాము అని చెప్పిన ఆయన… గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల వైద్య సేవలు పెంచేందుకు పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్…
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా గెలిచినందుకు సదరు లేఖలో కవితకు రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి నాయకురాలిగా ఇనుమడించిన కీర్తిని గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలు అందుకుంటారని భావిస్తున్నా’…
ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయవద్దని చెప్పాం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు.. పార్లమెంట్ లో ముందు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశాం. తెలంగాణలో పంట మొత్తం కొనాలి.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ధాన్యం పంట కొనుగోలు గురించి రెండు నెలల్లో 4,5 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు చర్చించారు. చివరికి చేతులు ఎత్తేసి..…
హైదరాబాద్ నడిబొడ్డున యువత రెచ్చిపోయారు. మందు, విందు, యువతులతో కలిసి చిందేశారు. రచ్చరంబోలా చేశారు. దీంతో సమాచారం అందుకున్న స్సెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు షాకయ్యారు. రేవ్ పార్టీ పేరుతో యువత చిందులేశారు. ఈ సందర్భందా 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. పెద్ద మొత్తంలో…
చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరుగుతున్న చలితో జనం ఇబ్బందిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 11 .3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 11.4 డిగ్రీలు, గిన్నేదారిలో 11 .5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 11.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 12 .7 డిగ్రీలు…
యాసంగిలో వరి పంట వేయాలా? వద్దా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. ఇప్పటికే మార్కెట్లకు చేరిన పంట.. కల్లాలు, రోడ్లపై ఉన్న పంట కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారే నడిచింది.. ఇక, తాజాగా యాసంగిలో వరి పంట వేయొద్దంటూ కేంద్రం కూడా స్పష్టంగా చెప్పేసింది.. దీంతో.. యాసంగిలో వరి పంట వేయొద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. పౌర సరఫరాల శాఖ అధికారులతో…
దేశ ఆరోగ్య సూచిల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలంటూ కీలక సూచనలు చేశారు మంత్రి హరీష్రావు.. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వైద్య రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సూచిల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించాలన్నారు. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు పూనుకోవాలని ఆదేశించారు హరీష్రావు.. ఇక, విభాగాల వారీగా అధికారులు వారి…
సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. దూరం పాటిస్తూ వస్తున్న కోమటిరెడ్డి. అనూహ్యంగా ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షలో ప్రత్యక్షమయ్యారు… రేవంత్ శిబిరంలో కోమటిరెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీంతో.. పార్టీ కేడర్లో జోష్ కూడా పెరిగింది.. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా…
పదవుల పందేరంలో వారికి మరోసారి రెన్యువల్ దక్కలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రాజకీయంగా గ్రహణం పట్టిందా.. లేక భవిష్యత్లో ఇంకేదైనా పదవీయోగం ఉంటుందా? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి..? పదవి గ్యారెంటీ అనుకున్నారు. కానీ.. కొందరు మాజీగానే మిగిలిపోతే.. ఇంకొందరు జనవరిలో మాజీలు కాబోతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రెన్యువల్ ఖాయమని భావించిన వారి ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం…