1) రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు.. నేడు రాజ్యసభ ప్రతిపక్షనేతల సమావేశం.. ఎంపీల సస్పెన్షన్‌పై తదుపరి కార్యాచరణ2) హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, రక్తదానం చేసినవారికి నేడు ఉచితంగా తిరుగుప్రయాణ బస్సు సర్వీసు3) టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం… ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ4) తిరుపతి: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, సొసైటీ ఉద్యోగులకు టీటీడీ కార్పొరేషన్ ప్రక్రియను నిలిపివేయాలని నేడు మహాధర్నా5) తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణం6) నేడు…
తెలంగాణలో గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది. విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష జరిపారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడి విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. Read Also గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులకు కరోనా !…
కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ వ్యవహరించాలి. రైతులకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం దగ్గర ధాన్యం సేకరణ పాలసీ వుంది. దేశంలో బాయిలర్ రైస్ వాడడం లేదు. తెలంగాణలో ఎవరూ తినడం లేదు. ఏ రైస్ తినాలో ప్రజలపై వత్తిడి తీసుకురాలేం. ఆహార భద్రత కింద 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం అన్నారు కిషన్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినేట్ సమావేశం.. ప్రగతి భవన్ లో జరుగుతోంది. అయితే.. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. వరి ధాన్యం కొనుగోలు పై ముఖ్యంగా చర్చ జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే…. యాసంగి లో వరి సాగు, కొత్త వరైటీ , ప్రత్యామ్నాయ పంటల పై కూడా చర్చ జరుగనున్నట్లు…
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం అయిన ఒమిక్రాన్.. యావత్ ప్రపంచం వణికిపోయేలా చేస్తోంది.. ఈ వేరియంట్ వెలుగుచూసిన 4 రోజుల్లోనే ఏకంగా 14 దేశాలకు వ్యాప్తి చెందింది అంటే.. దాని స్పీడు, తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండడంతో ఇప్పటికే రాష్ర్టాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం… మరోవైపు విదేశాల నుంచి వచ్చే…
టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు చోటులేదని..కేవలం భజన పరులకు మాత్రమే చోటు ఉందంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేడు పాల్వంచలో పర్యటించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా పాల్వంచ తెలంగాణ నగర్ లో ఈటలకు ఘనస్వాగతం పలికారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలను టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోదని మండిపడ్డారు. ఈ తెలంగాణ నగర్ లో నివాసం ఉండేది నిరుపేదలని.. అందుకే వారికి ఇళ్ల పట్టాలు…
మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరియమ్మ మృతి పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది హై కోర్టు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన రీతిలోనే.. జరుగుతోందని.. ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మరియమ్మ కస్టోడియల్ మృతి పై విచారణ ముగించిన హై కోర్టు.. ఈ కేసులో తార్కిక ముగింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది. మరియమ్మ కస్టోడియల్ మృతి పై ప్రస్తుత దశలో ఎలాంటి చర్యలు అవసరం…
మెచ్చిన ఫుడ్.. నచ్చిన చోటుకు తెప్పించుకోవడానికి ఇప్పుడు ఆహార ప్రియులు మొత్తం ఆన్లైన్ ఫుడ్ డెలవరీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు.. తమ పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నేరుగా ఆఫీసుకి, ఇంటికి.. ఎక్కడుంటే అక్కడికి మెచ్చిన ఆహారం పార్సిల్ రూపంలో వచ్చేస్తోంది. ఇక, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో కీలక భూమిక పోషిస్తోంది.. అయితే, ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ గ్రేటర్ హైదరాబాద్ విభాగంలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ సమ్మెకు రెడీ అవుతున్నారు. కనీస చార్జీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలను డిమాండ్…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతున్నారు రాజకీయ నేతలు.. తెలంగాణ కొన్ని స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడిపోగా.. మిగతా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడంతో.. పోటీ అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో తమ ప్రజాప్రతినిధులు చేజారకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు.. అందులో భాగంగా ఆదిలాబాద్‌లో అధికార పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంప్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యింది……