తెలంగాణను వణికిస్తున్న చలిపులి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలిపులి వణికిస్తోంది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతుండడంతో.. బ యటకు రావాలంటేనే జనం వణుకుతున్నారు. ప్రదానంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలు చలికి గజగజలాడుతున్నాయి. పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, చల్లని గాలులు వీస్తుండడంతో.. బయటకు రావాలంటే జనం వణికిపోతున్నారు. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండడంతో.. ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమవుతున్నాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు
రాత్రి పూట ఉష్ణోగ్రతలు అత్యంతస్వల్పంగా నమోదవుతుండడం, ఉదయం పది గంటల వరకూ మంచుప్రభావం కనిపిస్తుండడంతో… చలి అధికంగా ఉంటోంది. దీంతో జనం చలిమంటల దగ్గరే కాలం గడుపుతున్నారు. ఓవేళ బయటకు రావాలన్నా స్వెట్టర్లు, రగ్గులతో కాలం గడుపుతున్నారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
విశాఖలో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు అటు,ఇటుగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా జి.మాడుగులలో ఆరు డిగ్రీలు నమోదు కాగా… లమ్మసింగి,ఇతర ప్రాంతాల్లోనూ అంతే స్థాయిలో ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. ..కుమ్రం భీం జిల్లాలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోను ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. గత రికార్డులు పరిశీలిస్తే…1970 డిసెంబర్ 12న సిటీలో 7.5 డిగ్రీల స్వల్ప ఉష్ణోగ్రత నమోదైంది. 1945 జనవరి 8న 6.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖలో పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని, ఇక ఏజెన్సీ ప్రాంతమైన అరకులో.. పండుగలోపు ఐదు డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!