ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు… రేపు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవనున్నారు. మరోసారి కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి ఖరీప్ సీజన్ లో పండే వరిధాన్యం కొనుగోలుపై స్పష్టత కోరనున్నారు తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం. ప్రస్తుతం ముంబైలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రేపు ఢిల్లీ కి వచ్చిన తర్వాత, తెలంగాణ నేతల బృందం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీకి చేరుకున్న మంత్రుల బృందంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో సహా, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉండగా… నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చిన లోకసభ టీఆర్ఎస్ నాయకులు నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఉన్నారు. అలాగే ఈ రోజు రాత్రి మరో ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు, గంగుల ప్రభాకర్, పలువురు ఎంపీలు ఢిల్లీకి రానున్నారు.