తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి వెబ్సైట్ లో భారీ మార్పులకు సిద్ధమైంది. నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్ తో సమస్యల పరిష్కారం చూపించనుంది. వ్యవసాయ భూమిలో ఇండ్లు నిర్మించుకుంటే రైతుబందు అమలు నిలిపివేయనున్నారు. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలోకి లక్షల ఎకరాల భూములు వెళ్లాయి. ధరణిలో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణిలో సమస్యల పై కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు వేలాది మంది రైతులు.…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… కేసీఆర్ ఆరిపోయే దీపం అంటూ మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్న ఆయన.. కేసీఆర్ పని అయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుందని జోస్యం చెప్పారు.. ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన ఈటల… కరీంనగర్లో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు… కరీంనగర్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్.. ఎమ్మెల్సీగా గెలుస్తారంటూ…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. తెలంగాణలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా వీటిలో ఆరు ఏకగ్రీవం అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో ఒక్కో స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. Read Also: మహిళతో రాసలీలలు… అడ్డంగా దొరికిపోయిన వనపర్తి ఎస్సై రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు… మహబూబ్‌నగర్ జిల్లా…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మళ్లీ ట్విస్ట్ నెలకొందా? రోజులు గడుస్తున్నా ఈ అంశంపై ఉలుకు లేదు.. పలుకు లేదు. కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్ ఉత్కంఠ రేకెత్తించడంతో.. ఇప్పుడేం జరుగుతుందా అని టీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. మధుసూదనాచారి ఎమ్మెల్సీ ఫైల్‌పై కబురు లేదా? గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ నియామకం తెలంగాణలో మళ్లీ చర్చగా మారుతోందా? గతంలో కేబినెట్ ఆమోదించి పంపిన కౌశిక్‌రెడ్డి ఫైల్‌ను అనుమానాల నివృత్తికోసం గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. సోషల్ సర్వీస్ కింద కౌశిక్‌రెడ్డి పేరును…
సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ పోలీస్ రాసలీలలు బహిర్గతం అయ్యాయి. వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ కొత్తపేటకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మహిళ భర్తకు తెలిసిపోయింది. దీంతో ఎస్సై షఫీని, తన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఓ ప్లాన్ వేశాడు. మహిళ భర్త ప్లాన్‌కు అతడి స్నేహితులు కూడా సహకరించారు.…
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారా? జిల్లాలకు కొత్త నాయకత్వం రాబోతుందా? పీసీసీ చీఫ్ ఆలోచనేంటి? ఉన్న వాళ్లందరినీ మర్చేస్తారా? పదవులను కట్టబెట్టేందుకు ప్రామాణికంగా భావిస్తున్న అంశాలేంటి? జనవరి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు..! తెలంగాణ కాంగ్రెస్‌కి పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై ఎక్కువ చర్చ జరిగింది. ఎవరెవరు టీంలో ఉంటారు. ఎవరిని బయటకు పంపిస్తారు అని ఆరా తీశారు. రేవంత్ భారీ సభలు.. కార్యక్రమాలపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్ర…
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 ఏళ్ళ కల అది. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావాలని కోరుకున్నారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆదివాసీలు తమ కల సాకారం అయినందుకు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. 30 నివాస సముదాయాలున్న ఆదివాసీ గ్రామం మంగీ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఆర్టీసీ బస్సు శబ్దం వినిపిస్తోంది. రయ్యి రయ్యి మంటూ దూసుకువస్తున్న ప్రజారవాణా వ్యవస్థను అక్కడి మహిళలు, పిల్లలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మంగీ గ్రామ పంచాయతీకి…
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టాయి.. ఇక, తెలంగాణలో డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్‌సెంటర్…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పటికే సీనియర్ నేత గట్టు రామచంద్రరావు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా, కరీంనగర్ మాజీ మేయర్, 51 డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవిందర్ సింగ్.. పార్టీకి గుడ్‌బై చెప్పారు… ఈ మేరకు రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు రవిందర్ సింగ్… టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ ద్రోహులకు అవకాశాలు ఇచ్చి.. ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని లేఖలో ఆరోపించారు మాజీ మేయర్.. కాగా, స్థానిక…
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని లుంబిని పార్క్ వద్ద ఉండే పాత సచివాలయాన్ని కూలగొట్టి ప్రతిష్టాత్మకంగా నూతన సచివాలయాన్ని నిర్మిస్తోంది. అయితే సచివాలయం నిర్మాణం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తగా నిర్మించే సచివాలయం కోసం పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంపై మండిపడింది. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది. Read Also: సింగరేణిలో…