తెలంగాణ బీజేపీ ఎంపీలు సభ్యత… సంస్కారం లేకుండా మాట్లాడారు… దానిని ఖండిస్తున్నాము అని బాల్క సుమన్ అన్నారు. ధర్మపురి అరవింద్ ఒక బజారు మనిషిలా మాట్లాడారు… ఆయనో దగుల్బాజీ. ఇదే పద్ధతిలో ఉంటే తెలంగాణ రైతులు మిమ్మల్ని బట్టలు ఊడదీసి కొడతారు. తెలంగాణ రైతులపై బీజేపీ కక్ష కట్టిన్నటు కనిపిస్తుంది. వడ్లు కొంటరా.. కొనరా మాట్లాడకుండా… సీఎం కేసీఆర్ పై అడ్డం దిడ్డంగా మాట్లాడుతున్నారు అని తెలిపారు. పసుపు బోర్డు తేలేని సన్నాసి ధర్మపురి అరవింద్అని చెప్పిన…
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు సంబంధించిన స్టేటస్‌ను మంగళవారం నాడు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విమానాయానశాఖ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో, మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. Read Also:…
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్ అని… తెలంగాణలో పండే నాణ్యమైన బియ్యాన్ని ప్రైవేటుగా రైస్ మిల్లర్లకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణకు కేంద్రం ఏం చేయడం లేదని.. అందులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి ప్రస్తావన చేస్తాడని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు స్థల కేటాయింపు జరగలేదని… రీ సైకిల్ బియ్యాన్ని టీఆర్ఎస్ నేతలు ఎఫ్.సి.ఐ…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని అబద్ధాలు ఆడరని ఆమె మండిపడ్డారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన భాష మార్చుకోకుంటే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. Read Also: వడ్ల…
కాంగ్రెస్‌లో అంతే..! ఒకరంటే ఇంకొకరికి గిట్టదు. నువ్వెంత అంటే.. నీకంటే తక్కువ..! నాకేంటి అనుకుంటారు. ఇప్పుడా ఆ సీన్ మారుతుందా? వస్తారని అనుకున్న వాళ్లు డుమ్మా కొడుతున్నారా? రారని అనుకున్నవాళ్లు వచ్చి ఆశ్చర్యపరుస్తున్నారా? ఎంపీ కోమటిరెడ్డి వస్తారని ఎవరికీ తెలియదా? తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్ష కాంగ్రెస్‌లో అనేక రాజకీయాలకు వేదికైంది. దీక్షకు పీసీసీ కసరత్తు చేసినప్పుడు పార్టీ కార్యక్రమాలకు రెగ్యులర్‌గా వచ్చేవాళ్లు వస్తారు అని అనుకున్నారు.ఈ జాబితాలో లేని వ్యక్తి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.…
హైదరాబాద్ లోని ఎంజీబీఎస్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్త దానం చేశారు సజ్జనార్. అనంతరం ఆయన మాట్లాడుతూ… టీఎస్ ఆర్టీసీ యాజమాన్య ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ 97 డిపోలు 67 సొసైటీలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సర కాలంగా బ్లడ్ కొరత ఏర్పడుతుందని… తలేసిమియా వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషంట్స్, యాక్సిడెంట్ వారికి…
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఓ వ్యక్తి మంగళవారం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే… దేవరుప్పుల గ్రామానికి చెందిన దుంపల సంపత్ అనే వ్యక్తి తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఎవరో ఆక్రమించారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నాడు. Read Also: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ విజయవంతం తన భూమి ఆక్రమణకు గురైందని ఎంతమంది అధికారులకు…
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందంటోంది వ్యవసాయ శాఖ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూన్నారు ఉద్యానవన శాఖ అధికారులు.దేశవ్యాప్తంగా కూరగాయలకు రోజురోజుకు డిమాండ్ పెరుతుంది. కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలో ఉద్యానవన శాఖ అధికారులు ఏయే కూరగాయలు సాగు చేస్తే లాభం చేకూరుతుంది అనే దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువగా టమాటా, మిర్చి వంటి కురాగాయలతో…
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీఎస్ఆర్టీసీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు సజ్జనార్ వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడం… ఆర్టీసీ బస్సులో ప్రయాణించి స్వయంగా సమస్యలు తెలుసుకోవడం… ఇలా ఒకట్రెండు కాదు.. ఎన్నెన్నో వినూత్న చర్యలను సజ్జనార్ చేపడుతున్నారు. గతంలో పోలీస్ కమిషనర్‌గా తన మార్క్ చూపించిన సజ్జనార్.. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగానూ తన మార్క్ చూపిస్తుండటం విశేషం. Read Also: రికార్డుస్థాయికి…