దళితుల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. మొదటగా తాను దత్తతతీసుకున్న వాసాలమర్రిలో పూర్తిస్థాయిలో అమలు చేసిన కేసీఆర్.. ఆ తర్వాత హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అంతటా అమలు చేయాలన్న ఉద్దేశంతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నిధులు కూడా విడుదల చేశారు.. అంతే కాకుండా.. మరికొన్ని మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే, దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్.. సంబంధిత లబ్ధిదారులకు యూనిట్లు మంజూరయ్యే వరకు ప్రత్యేక ఖాతాల్లోని నగదుపై వడ్డీ జమ చేయనున్నారు.. లబ్ధిదారుల పేరిట ఖాతాల్లో నిధులు ఉన్నందున ఆ వడ్డీపై పూర్తి హక్కులు వారికే లభించేలా నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.. ఇప్పటికే కొందరు దళితుల ఖాతాల్లో డబ్బులు జమ అయినందున.. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో లబ్ధిదారులకు మేలు చేకూరనుంది.. ఒక్కో లబ్ధిదారునికి కనీసం రూ.8-9వేల వరకు వడ్డీరూపంలో అందే అవకాశం ఉందని చెబుతున్నారు.