తెలంగాణలో కరోనా రోజువారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,037 శాంపిల్స్ పరీక్షించగా… 162 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు.
ఇదే సమయంలో 210 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,80,413 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,72,847 కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4,019 కు చేరినట్టు బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,547 యాక్టివ్ కేసులు ఉన్నాయి.