ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలపై గత వారం రోజుల నుంచి తీవ్ర గందర గోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 35 మార్కులతో ఫెయిలైన విద్యార్థులందరినీ… పాస్ చేస్తున్నట్లు తెలిపారు. మినిమమ్ మార్కులు వేసి.. ఈ సారి పాస్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు సబితా ఇంద్రారెడ్డి. ఇకనైనా విద్యార్థులు వచ్చే పరీక్షలపై దృష్టి సారించాలని కోరారు.
ఇప్పటికైనా సెకెండ్ ఇయర్ పరీక్షల కోసం కష్టపడి చదవాలని… భవిష్యత్ లో ఇలా పాస్ చేయడం ఉండదని స్పష్టం చేశారు. :కరోనా వల్ల అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయని… విద్యా వ్యవస్థ కూడా ఇబ్బందులు పడిందన్నారు. 3వ తరగతి నుంచి పీజీ వరకు టి సాట్, డిజిటల్ క్లాసులు నిర్వహించామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 95 శాతం మంది ఇంటిలో దూరదర్శన్, 40 శాతం మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని ప్రభుత్వం దగ్గర వివరాలు ఉన్నాయని… వాట్సాప్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు క్లాసులు బోధించామని పేర్కొన్నారు. 9వ తరగతి పిల్లలని 10కి పంపించామని… 10th వాళ్ళను ఇంటర్ కు పంపామని గుర్తు చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.