దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్, ఒమిక్రాన్ మహమ్మారులను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండటంతో ఉదయం ఆరు గంటల తరువాత ఆయా రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారమే వేడుకలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణలోని మెదక్ సీఎస్ చర్చిలో ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శిలువ ఊరేగింపు మొదటి ఆరాధనలో చర్చ్ బిషప్ సాల్మన్ రాజు పాల్గొన్నారు.
Read: నూతన సంవత్సర వేడుకలపై ఒమిక్రాన్ ప్రభావం…
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇత ఏపీలోనూ క్రిస్మస్ వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అక్కడ కూడా రాత్రి నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.