అక్కడ కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అత్తా అల్లుళ్ల మధ్య వార్ రాజుకుంది. పంతం నెగ్గించుకునేందుకు ఒకరు.. పట్టు సడలకుండా ఇంకొకరు పొలిటికల్ పన్నాగాలు పన్నుతున్నారు. ఎవరు వాళ్లు? ఏంటా రాజకీయ యుద్ధం? గద్వాలలో డీకే అరుణ వర్సెస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి..! నడిగడ్డగా పిలిచే గద్వాల రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అది రాష్ట్ర రాజకీయమైనా.. స్థానిక సమస్య అయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. అలాంటిది గద్వాల కొంతకాలంగా పొలిటికల్‌గా సైలెంట్.…
చలిపులి వణికిస్తోంది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతుండడంతో.. బ యటకు రావాలంటేనే జనం వణుకుతున్నారు. ప్రదానంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలు చలికి గజగజలాడుతున్నాయి. పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, చల్లని గాలులు వీస్తుండడంతో.. బయటకు రావాలంటే జనం వణికిపోతున్నారు. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండడంతో.. ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమవుతున్నాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు రాత్రి పూట ఉష్ణోగ్రతలు అత్యంతస్వల్పంగా నమోదవుతుండడం, ఉదయం…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. మంగళవారం దీక్షలు, పాదయాత్ర, ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలతో.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ఆమె… ఇక, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర వాయిదా పడిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్న ఆమె.. ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.. అందులో భాగంగా ఇవాళ రైతు…
హైదరాబాద్ నగరంలో చలి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఈ దశాబ్దంలోనే డిసెంబర్ నెలకు సంబంధించి అత్యంత చలి రోజుగా 18వ తేదీ (శనివారం) రికార్డు సృష్టించింది. శనివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద 8.2 డిగ్రీలు, పటాన్ చెరువులో 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ దశాబ్దంలో డిసెంబర్ నెలలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో 2015 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో 9.5 డిగ్రీల…
✍ నేడు అన్నవరం సత్యనారాయణస్వామికి కోటి తులసి దళార్చన.. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా స్వామివారికి కోటి తులసి దళార్చన✍ నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన… మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మనవడు వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న చంద్రబాబు✍ తిరుపతి: నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ జాతీయ సదస్సు✍ నేడు వరంగల్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన.. కోర్టు కాంప్లెక్స్, నల్సార్ యూనివర్సిటీలో బాలుర, బాలికల హాస్టళ్లను ప్రారంభించనున్న సీజేఐ,…
తెలంగాణలో కరోనా క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,484 శాంపిల్స్ పరీక్షించగా… 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 205 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,79,430 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,71,655 కు పెరిగాయి..…
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చి కునేందుకు టీఆర్ ఎస్ సర్కార్ సన్నద్ధం అయింది. ఇందు లో భాగంగానే… ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి తరలివెళ్లింది తెలంగాణ మంత్రుల బృందం. అంతేకాదు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ,ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీశ్వర్ రెడ్డి ,పువ్వాడ అజయ్…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగి పోతుంది. తాజాగా తెలంగాణ లో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని వైద్య శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20 కి చేరింది. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి.. ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రిస్క్ దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రనికి వచ్చిన ఇద్దరికీ కొత్త వేరియంట్ వచ్చిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ…
తెలంగాణ సీఎం కేసీఆర్.. రైతులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధును డిసెంబర్ 28 వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు సీఎం కేసిఆర్. ప్రారంభించిన వారం నుండి పది రోజుల్లో గతంలో మాదిరి వరుస క్రమంలో అందరి ఖాతాల్లో జమ అవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. రైతు బంధు అమలు పై రైతులు ఆందోళన చెందనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే.. దళిత బంధు…
సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ లపై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. స్థానిక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని..కాంగ్రెస్ లో నుండి పోయ్యేది లేదు… ఇక టీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ చెరువు తెగింది..ఇక కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండాలని కోరారు. గతంలో…. జేబు నిండా పైసలు తీసుకెళ్తే… సంచి నిండా కూరగాయలు వచ్చేవని..కానీ ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకుపోతే…