తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ షాకిచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు… నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.…
తెలంగాణలో ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్ధులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు రద్దుచేసి, తిరిగి నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 51 శాతం విద్యార్ధులు ఫెయిలయ్యారు. ఇంటర్ ఫలితాలలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఫెయిల్ అయింది విద్యార్థులా..? లేక ఇంటర్ బోర్డా..? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధుల్లో కొందరికి పదిలోపే మార్కులు వచ్చాయి. బాగా చదివే విద్యార్ధులకు కూడా ఒకటి రెండు సబ్జెక్టుల్లో…
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలిపులి పంజా విసిరింది. తిర్యాని మండలం గిన్నెదరిలో 8.3 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (యూ) లో 9 డిగ్రీలు నమోదయింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల చలి బాగా పెరిగింది. నగరం చలి గుప్పిట్లో చిక్కుకుంది. జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మూడు రోజులుగా పెరుగుతున్న చలి నగరవాసులన్ని వణికిస్తుంది. మూడు రోజుల క్రితం 19 డిగ్రీల సెల్సియస్గా ఉన్న కనిష్ట…
చాలా రోజుల తర్వాత ప్రభుత్వ పథకాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వివిధ పథకాల అమలు, వ్యవసాయంతో పాటు పాటు దళిత బంధు పథకం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు పై కూడా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఈ రోజు సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు కూడ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం హైదరాబాద్ లోని…
★ నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు… నిత్యావసర ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ నేతల పాదయాత్రలు.. యూపీలో పాదయాత్ర ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక★ నేటి నుంచి పాపికొండల విహారయాత్ర పున:ప్రారంభం.. తూ.గో. జిల్లా పోచవరం నుంచి ప్రారంభం కానున్న పాపికొండల విహారయాత్ర★ విజయవాడ: నేడు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం… ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఇస్రో ఛైర్మన్ డా.శివన్, గౌరవ అతిథిగా హాజరుకానున్న ఓల్వో కంపెనీ ఎండీ కమల్ బాలి, చాగంటి కోటేశ్వరరావు, సినీ…
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం విడుదల చేయాలని… నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు బండి సంజయ్. ఉద్యోగ, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ (సర్దుబాటు) కోసం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి…
టీఆర్ఎస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ. శ్రీనివాస్… కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. చాలా కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న డీఎస్.. కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే… డీఎస్ రాకపై నిజామాబాద్ జిల్లా తో పాటు..రాష్ట్రంలోని సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ దగ్గర అభ్యంతరం వ్యక్తం చేయడంతో డీఎస్ కి క్లియరెన్స్ రాలేదు. అప్పట్లో డీఎస్ చేరిక అలా వాయిదా పడింది.ప్రస్తుతం సోనియా గాంధీ పార్టీ బాధ్యతలు చూస్తుండడంతో , ds మరోసారి తన…
తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చదువు చెప్పకుండా విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలామంది పేద విద్యార్థులు తరగతులకు హాజరు కాలేకపోయారని, ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. Read Also:…
ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు కాపు కాస్తారు. ఉద్యమాల్లో కాంగ్రెస్తో దోస్తీ. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీల తీరు ఇది. రైట్ టర్న్ తీసుకుంటున్న సమయంలో లెఫ్ట్ ఆలోచనలు ఎందుకు మారుతున్నాయి? కామ్రేడ్ల నిర్ణయాల వెనక బలమైన కారణాలు ఏంటి? ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల వైఖరిపై ఆసక్తికర చర్చ..! తెలంగాణలో ఎన్నికలేవైనా.. కమ్యూనిస్ట్ పార్టీలపై కూడా చర్చ జరుగుతుంది. సీపీఐ, సీపీఎంలు ఏం చేస్తాయి? పోటీ చేస్తాయా.. లేదా? ఎవరికి మద్దతుగా నిలుస్తాయి అనేది ఆ చర్చ సారాంశంగా ఉంటుంది.…