సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే .. తెలంగాణలో ఈ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవరసరం లేదు. రాఘవకు ఎలాగైనా శిక్ష పడాలంటూ తన చివరి సెల్ఫీ వీడియోలో రామకృష్ణ కోరారు. కాగా తాజాగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ రిమాండ్ రిపోర్టులో ఆయన కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయని, ఆత్మహత్య కేసులో ముందస్తు బెయిల్‌లో ఉన్నాడని రిపోర్టులో పేర్కొన్నారు.
Read Also: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది: మంత్రి నిరంజన్‌రెడ్డి
రాఘవపై కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ టౌన్, పాల్వంచ రూరల్, లక్ష్మీ దేవిపల్లి పోలీసు స్టేషన్‌లలో ఉన్న కేసుల వివరాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. ఈ కేసులలో పాల్వంచ టౌన్‌లో అయిదు కేసులు, మరో రెండు కేసులు పాల్వంచ రూరల్‌లో ఉన్నాయన్నారు. అదే విధంగా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మరో మూడు కేసులు, లక్ష్మీ దేవిపల్లిలో ఒక్క కేసు నమోదయిందన్నారు. ఇప్పుడు తాజాగా పాల్వంచ టౌన్‌లో మరో కేసు నమోదయిందని, మొత్తం 12 కేసులు రాఘవపై నమోదు అయ్యాయని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు.