తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి మండలం నారాయణపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు… తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ అండగా నిలిచి రైతుబంధు అమలు చేస్తున్నారన్నారు. రైతు కష్టం తెలిసిన ముఖ్యమంత్రి అని కేసీఆర్‌ను కొనియాడారు. తెలంగాణ రైతాంగం కోసం కేసీఆర్ కేంద్రంతో కొట్లాడుతున్నారన్నారు.
Read Also: ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు
రైతులు పండించిన పంటను కొనుగోలు చేయటానికి కేసీఆర్ ముందుకు వచ్చారని నామా పేర్కొన్నారు. దేశంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమంని ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు అన్నారు. రైతుల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని సాగునీరు, ఉచిత విద్యుత్‌ను అందజేసి రైతుల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని నామా తెలిపారు.