తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల ప్రకటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? విద్యార్థుల్ని కనీస మార్కులతో పాస్ చేస్తే సమస్య పరిష్కారమైనట్టేనా? జరిగిన తప్పుల్ని సరిద్దిద్దుకునేది ఎలా? తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల సరళిపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాలని… ఫెయిలైన విద్యార్థుల్ని పాస్ చేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఫలితాలను అన్ని కోణాల్లో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.…
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ‘జాతిరత్నాలు’ ఫేం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఫిలింనగర్లో ఆమె మొక్కలు నాటారు. అనంతరం నటి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా హీరోలు ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వీ మేఘనకు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని నటి…
ఎప్పుడూ అధికారులతో సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే మంత్రి కేటీఆర్ గోవా పర్యటనలో హాయిగా సేద తీరారు. ఈ సందర్భంగా గోవాలో ఆయన రోడ్ సైడ్ షాపింగ్ చేశారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గోవా టూర్ వెళ్లిన మంత్రి కేటీఆర్ తన ఫ్యామిలీతో కలిసి లోకల్ బజారులో షాపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా అక్కడ షాపింగ్ చేసిన ఫోటోలతో పాటు చిరు వ్యాపారులతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26,947 శాంపిల్స్ పరీక్షించగా… 140 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈరోజు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇదే సమయంలో 186 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,80,553 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,73,033…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున సహాయం మంజూరు చేసింది. మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27 మంది రైతులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 మంది రైతులు, భూపాలపల్లిలో 12 మంది రైతుల…
కరోనా మహమ్మారి వల్ల సామాన్యులతో పాటు ఎందరో రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారం రోజుల పాటు రైతుల సమస్యలపై ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి.. శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి ఎర్రబెల్లి ప్రస్తుతం…
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్రమంగా పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 41 కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరింది. ఇవాళ ఒమిక్రాన్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు… విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అయితే.. ఈ ముగ్గురు ఇంకా ఎవరినైనా కలిసారా.. అనే దానిపై వైద్య అధికారులు ఆరా తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా..తెలంగాణ రాష్ట్రంలో న్యూ…
తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ గేమ్ రసవత్తరంగా నడుస్తోంది. జనం దృష్టిలో వీరు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు. కానీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారనేది బహిరంగం రహస్యం. బహుశా అందుకే కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరచూ వీరిది మ్యాచ్ ఫిక్సింగ్ బంధమని ఎగతాళి చేస్తుంటుంది. రహస్య స్నేహితులని ఆరోపిస్తుంటుంది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు అంశంపై రెండు పార్టీలు చేస్తున్న హంగామా కూడా అలాంటిదేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఖరీఫ్…
తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు విధించింది కేసీఆర్ సర్కార్. హై కోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ్టి నుంచే జనవరి 2వ వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీ లు , బహిరంగ సభలు నిషేధిస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఓమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం… పబ్లిక్ ఈవెంట్స్…
వైద్య, ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో వందపడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా వుందన్నారు. ఇది స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కళ. రామలింగన్న కోరిక.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన వరం దుబ్బాక లో వందపడకల ఆసుపత్రి. ముఖ్యమంత్రి కెసిఆర్ కు దుబ్బాక మీద చాలా ప్రేమ వుందన్నారు. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తే ముఖ్యమంత్రి సంతోషిస్తాడు. స్వర్గీయ ముత్యంరెడ్డి హయాంలో కాని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం…