తెలంగాణలో నిరుద్యోగ దీక్షకు దిగింది బీజేపీ. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. మంత్రి కేటీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’ను అవమానిస్తూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ పేరుతో చేసిన విమర్శలు చేయడం ముమ్మాటికీ నిరుద్యోగులను అవమానించడమే.…
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్రమంగా పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 44 కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరింది. ఇందులో రెండు నాన్ రిస్క్ దేశాల నుండి వచ్చిన కేసులు కాగా… ఒకటి ఒమిక్రాన్ పేషేంట్ కాంటాక్ట్ లో మరో కేసు నమోదు అయింది. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య 34 గా…
తెలంగాణ మంత్రులు హరీష్, కేటీఆర్ లకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గోవా, దుబాయ్ లు తిరిగే బదులు.. ఛత్తీస్ ఘడ్ రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ఇంకెక్కడైనా ఉన్నాయా అని టీఆర్ ఎస్ నేతలు అంటున్నారని.. ఛత్తీస్ ఘడ్ వస్తే అక్కడి అభివృద్ధి చూపిస్తానని ఛాలెంజ్ విసిరారు. వరి కాకుండా ఇంకో పంట సాగు చేస్తే… ఎకరాకు 9 వేల సాయం చత్తీస్ ఘడ్ ప్రభుత్వం చేస్తుందని…
తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది జరిమానాల రూపంలో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఏడాదిలో ఇప్పటిరకు రూ.533కోట్ల జరిమనాను పోలీసులు విధించారు. అంటే రోజుకు రూ. కోటిన్నర చొప్పున వసూలు చేశారు. Read Also: అంకుల్ అని పిలిచిన యువతి.. కోపంతో ఆ వ్యక్తి చేసిన పనికి… అయితే ట్రాఫిక్ ఛలానాలలో ఎక్కువగా హెల్మెట్ ధరించనందుకు విధించిన జరిమానాలే ఉన్నాయి. హెల్మెట్లు…
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ.. మరణించిన రైతులకు నిన్న తెలంగాణ ప్రభుత్వం పరిహారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. పరిహారం విడుదల చేయడం పై కేసీఆర్ పై షర్మిల సెటైర్లు వేశారు. కేసీఆర్ గారూ.. అందరూ రైతులకు పరిహారం ఇచ్చి.. పాప ప్రక్షాళన చేసుకోవాలన్నారు. చనిపోయిన రైతులు ఎందరు? మీరు ఇచ్చే పరిహారం ఎందరికి? ఇప్పటివరకు దాదాపు 7600 మంది రైతులు చనిపోతే 1600 మందికి పరిహారం ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. పరిహారం…
బీజేపీవి మొత్తం చీప్ ట్రిక్స్ రాజకీయాలేనని… మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ కు వస్తున్న ఐటీ, ఇతర కంపెనీలను చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గర్వపడాలని.. బీజేపీ అధ్యక్షుడు చేయబోయే దీక్ష ఎందుకో చెప్పాలి, యువకులు బీజేపీ చేస్తున్న ట్రిక్స్ గమనించాలని కోరారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.. 14 లక్షల మంది వలస వెళ్లే పాలమూరు జిల్లాకు…
రైతు చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. భేషరుతుగా దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, తిరిగి…
ఏ పార్టీకైనా అధికార ప్రతినిధులు బలం. విమర్శలు వచ్చినా.. సమస్యలపై స్పందించాలన్నా.. వాళ్ల పాత్ర కీలకం. కానీ.. ఆ జాతీయపార్టీలో స్పోక్పర్సన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవట. డజను మందికిపైగా అధికార ప్రతినిధులున్నా పార్టీ వాయిస్ లేదు..! తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక వేసిన పార్టీ పదవులు అధికార ప్రతినిధుల పోస్టులే. పార్టీకి అధికార ప్రతినిధుల పాత్ర కీలకమని భావించి వాటిని ప్రకటించారు. కాంగ్రెస్ వాయిస్ వినిపించడం.. సమస్యలపై పూర్తి అవగాహనతో స్పందిస్తారని…
కీలక సమయంలో ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం లైట్ తీసుకుందా? ప్రభుత్వంలోని పెద్దలను కలిసి మాట్లాడుతున్నా.. మార్పు లేదు? ఒకప్పుడు బదిలీలు.. పదోన్నతులు అంటే క్షణం తీరిక లేకుండా గడిపిన టీచర్ల సంఘాల నేతలు.. మౌనంగా ఎందుకున్నారు? ప్రత్యేక రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు నిర్వీర్యం..! తెలంగాణలో 50కి పైగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించేది. ఏదైనా జరుగుతుంది అంటే అందులో తమ ప్రమేయం ఉన్నట్టుగా హడావిడి చేసి ప్రకటనలు…
అయిననూ పోయిరావలె హస్తినకు అని.. ఢిల్లీ వెళ్లారు మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు. తిరిగొచ్చేశారు కూడా. మరి.. ధాన్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు అధికారపార్టీకి ఈ టూర్ ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఇండియా గేట్ దగ్గర ధాన్యం పారబోస్తామన్న మంత్రుల బృందం ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం దగ్గర తాడోపేడో తేల్చుకుంటాం.. చర్చలు జరిపి తీపి కబురుతో తిరిగొస్తాం అని ప్రకటించిన మంత్రులు, ఎంపీల బృందం హైదరాబాద్ చేరుకుంది. వారం రోజుల…