రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పిల్లి పల్లి అనే గ్రామంలో చిరుత సంచరిస్తునట్టు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామ ప్రజలను అలెర్ట్ చేసామన్నారు. రాత్రి సమయంలో ఊరిలో చాటింపు వేసి ఇళ్ల నుండి ప్రజలను బయటికి రావొద్దు అని చెప్తున్నాం..
రాత్రి సమయంలో పెట్రోలింగ్ వెహికిల్స్ ను ఉంచామన్నారు. చిరుత కనిపిస్తే వెంటనే డయల్100 కి కాల్ చేయాలి అని చెప్పాం. గ్రామస్థులు ఎవరు భయాందోళనకు గురి కావొద్దని భరోసా ఇచ్చారు ఏసీపీ బాలకృష్ణా రెడ్డి.