విద్యా విధానంపై తెలంగాణలో కొత్త చట్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో విద్యా విధానంపై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్ సమావేశం నిర్ణయించినట్టు తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ మరియు వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై.. కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు..
Read Also: ఏపీ కరోనా అప్‌డేట్
Also Read
కేబినెట్ సబ్ కమిటీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్‌లు సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో ‘‘ మన ఊరు – మన బడి ’’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు మంత్రి సబతి ఇంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
-
Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!