Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Anand Mahindra Thanks To Ktr And Ktr Thanks To Mahindra

ఒకరికొకరు థ్యాంక్స్‌ చెప్పుకున్న ఆనంద్‌ మహీంద్రా, కేటీఆర్..

NTV Telugu Twitter
Published Date :January 17, 2022 , 8:13 pm
By Sudhakar Ravula
ఒకరికొకరు థ్యాంక్స్‌ చెప్పుకున్న ఆనంద్‌ మహీంద్రా, కేటీఆర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఆనంద్‌ మహీంద్రా.. ఇద్దరూ ఇద్దరే… సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ.. అన్ని సమస్యలపై స్పందిస్తుంటారు.. వీరి పోస్టులు ఓసారి ఆలోచింపజేస్తే.. మరోసారి నవ్వు పెట్టిస్తాయి.. ఇంకోసారి పెట్టుబడులు తెస్తాయి.. మరికొన్ని సార్లు కొత్త ప్రాజెక్టులకు అడుగులు వేస్తాయి.. అయితే, సోషల్‌ మీడియా వేదికగా.. ఒకరికొరరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. దానికి ప్రధాన కారణం మాత్రం.. ‘ఫార్ములా ఈ’గానే చెప్పాలి.. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ రేసు కోసం హైదరాబాద్‌ నగరం వేదికగా ఖరారైంది.. దీనిపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.. ‘సొంత గడ్డపై తమ రేసింగ్‌ కార్లను ఉరుకులు పెట్టబోతున్నాయి.. చిరకాల కల నెరవేరబోతోంది.. ఈ కలను నెరవర్చేదిశగా ప్రయత్నాలు చేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు అంటూ ఆనంద్‌ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read Also: హైకోర్టు కీలక నిర్ణయం.. ఇక అన్నీ ఆన్‌లైన్‌లోనే..

ఇక, ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై రెస్పాండ్‌ అయిన మంత్రి కేటీఆర్.. ధన్యవాదాలు ఆనంద్ జీ అంటూ స్పందించారు.. హైదరాబాద్‌ వేదికగా జరగబోతోన్న ఈ రేసింగ్‌లో మహీంద్రా రేసింగ్‌ మంచి ముగింపుతో స్థానిక ప్రేక్షలను ఉత్సాహపరుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు, హైదరాబాద్‌ను బలమైన ఈవీ హబ్‌గా మార్చడంలో మీ మార్గదర్శకత్వం మరియు మద్దతు అవసరం అని తన ట్వీట్‌లో ఆనంద్‌ మహీంద్రాను ఉద్దేశించి పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. కాగా, ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో- తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌. సంయుక్తంగా ABB FIA ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణ గురించి సోమవారం ప్రకటించారు. ఇదే సమయంలో మహీంద్రా రేసింగ్ అందిస్తున్న మద్దతును కూడా అల్బెర్టో లాంగో ప్రస్తావించారు. ఈ రేసింగ్‌ పోటీలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ప్రత్యేక రేసింగ్‌ ట్రాక్‌ అక్కర్లేని ఈ ‘ఇ వన్‌​ ఫార్ములా’ ఛాంపియన్‌షిప్‌ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహిస్తూ వస్తున్నారు.. ఈ బృందంలో మహీంద్రా రేసింగ్‌ కంపెనీ కూడా భాగస్వామిగా ఉండడం మరో విశేషం. లండన్‌, న్యూయార్క్‌, మెక్సికో, రోమ్‌, బెర్లిన్‌, రోమ్‌, సియోల్‌, వాంకోవర్‌ లాంటి సిటీల్లో ఈ పోటీలు నిర్వహించగా… ఈ పోటీల తొమ్మిదో సీజన్‌ మాత్రం సౌదీ అరేబియాలోని దిరియా సిటీలో జరగబోతోంది.. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరగనుంది.

Thanks Anand ji 🙏

Hopefully @MahindraRacing will have a podium finish at Hyderabad cheered by home crowd

Need your guidance & support on making Hyderabad a strong EV hub https://t.co/WoS4E0klup

— KTR (@KTRTRS) January 17, 2022

We were one of the founding teams in Formula E and a long held dream of @MahindraRacing has been to race our cars on home ground, cheered on by a home crowd. Thank you @KTRTRS for taking a huge step towards making that dream a reality! We can’t wait… https://t.co/HF9OoVDVXO

— anand mahindra (@anandmahindra) January 17, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anand Mahindra
  • FIA Formula E
  • Formula E
  • hyderabad
  • ktr

తాజావార్తలు

  • Vijay Devarakonda : నా ప్రతి అవార్డు వాళ్లకే సొంతం.. విజయ్ ఎమోషనల్ పోస్ట్..

  • High Court Serious: కార్పొరేషన్‌ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా..? అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం..!

  • CM Chandrababu: రౌడీయిజం చేస్తామంటే నోరు మూయించే శక్తి టీడీపీకి ఉంది..

  • Mohan Babu: ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను!

  • Jawahar Navodaya: కొత్తగా ఏడు కొత్త నవోదయ విద్యాలయాలు.. జూలై 14 నుండి ప్రారంభం..!

ట్రెండింగ్‌

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions