కరోనా కేసుల విజృంభణ మళ్లీ కొనసాగుతుండడంతో.. అంతా ఆన్‌లైన్ బాట పడుతున్నారు.. ఇప్పటికే ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో.. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవాళ్టి నుంచే ఆన్‌లైన్ బోధనను తిరిగి ప్రారంభించాయి.. మరోవైపు.. న్యాయస్థానాల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు.. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో వెంటనే అన్ని కేసులను ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ఫిబ్రవరి 4వ తేదీ వరకు అన్ని కోర్టులు ఆన్‌లైన్‌లోనే కేసుల నిర్వహణ జరపాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది హైకోర్టు.. ఇక, హైకోర్టులోని అన్ని బెంచ్‌లు ఆన్‌లైన్‌లోనే కేసుల విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. కేసుల తీవ్రతకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.
Read Also: తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహించండి.. దేశ వృద్ధి రేటుకు ప్రయోజనం..