తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది అంటూ ప్రశంసలు కురిపించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇవాళ చాలా సంతోషంగా ఉంది.. కరోనా నేపథ్యంలో అందరూ భౌతికదూరం తోపాటు మాస్క్ ను ధరించాలని సూచించారు.. Read Also: నేరుగా గవర్నర్ దృష్టికి సమస్యలు.. రాజ్ భవన్లో…
కొత్త సంవత్సరం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. ఇవాళ రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆమె.. కేక్ కట్ చేశారు.. ఇక, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంపై ఫోకస్ పెట్టారు.. దాని కోసం రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా ఓ బాక్స్ ఏర్పాటు చేశారు.. రాజ్ భవన్ గేట్ దగ్గర ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశారు.. ఈ రోజు నుండి రాజ్‌భవన్ గేటు దగ్గర…
తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా సాగుతున్నాయి… డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ రికార్డులు సృష్టించాయి… డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు డిపోల నుండి జరిగిన మద్యం అమ్మకాలు విలువ రూ.3,459 కోట్లుగా ఉంది.. గత ఏడాది అంటే 2020 డిసెంబర్లో మద్యం అమ్మకాల విలువ రూ.2,764 కోట్ల 78 లక్షలుగా ఉండగా… 2021లో సరికొత్త రికార్డు సృష్టించాయి.. 2020 డిసెంబర్‌తో పోల్చుకుంటే ఈ 2021 డిసెంబర్లో సుమారు 700 కోట్ల మద్యం అమ్మకాలు…
మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. కష్టాలను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తామని కేసీఆర్ తెలిపారు. వినూత్న పంథాలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. Read Also: రేపటి నుంచి నుమాయిష్ ప్రారంభం మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు…
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మాకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. ఈరోజు బిల్లింగ్ క్లోజ్ వరకు సుమారు 40 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. 34 లక్షల కేసుల బీర్లు అమ్మాకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణ చరిత్రలోనే ఇది రికార్డ్ అని, ఈ స్థాయిలో లిక్కర్ సేల్ జరగడం ఇదే…
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో ఎలాంటి మతపరమైన హింసాకాండగానీ, మరే ఇతర ప్రధాన శాంతిభద్రతలుగానీ చోటుచేసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డి (డీజీపీ) అన్నారు. శుక్రవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నేరాల రేటును ఆయన వివరించారు. నిర్మల్ జిల్లా భైంసాలో గత ఏడేళ్లలో జరిగిన చిన్న చిన్న ఘటనలు తప్ప పెద్దగా ఎలాంటి మత ఘర్షణలు రాష్ర్టంలో చోటు చేసుకోలేదని ఆయన…
తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. కరోనా, ఒమిక్రాన్ కేసులపై విచారణ జరిపింది హైకోర్టు.. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్స్.. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని కోరారు.. ఇంత వరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. Read…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. దీంతో.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కార్ హత్య చేస్తోందంటూ మండిపడ్డ ఆయన.. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడు అని.. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోందన్న రేవంత్.. మేం ఇంట్లో…
ప్రపంచాన్ని వివిధ రూపాల్లో ఇప్పటికే భయపెడుతూనే ఉంది కరోనా మహమ్మారి.. ఓవైపు డెల్టా మళ్లీ పంజా విసురుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. అయితే, కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్లను విస్తృతంగా ప్రజలకు వేస్తున్నారు.. ఇక, ఇదే సమయంలో విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చారు.. మరోవైపు.. కరోనా చికిత్సలో అద్భుతమైన ఔషధంగా చెబుతున్న టాబ్లెట్ మార్కెట్లోకి వచ్చేసింది.. ‘మోల్నుపిరావిర్’ పేరుతో…