Revanth Reddy Targets KCR: కేసీఆర్‌ను నమ్మం.. మళ్లీ మోసపోం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేయడం.. అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డిని మళ్లీ కేసీఆర్.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది.. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి.. మోసగాడికి బ్రాండ్ అంబసిడర్ కేసీఆర్ అని వ్యాఖ్యానించిన ఆయన.. కేసీఆర్‌ను కాంగ్రెస్ రెండు సార్లు నమ్మి మోసపోయిందని.. మళ్లీ కేసీఆర్‌ని నమ్మి మోసపోం అన్నారు.. కాంగ్రెస్ పార్టీ.. సీఎం కేసీఆర్‌ను నమ్మదని స్పష్టం చేశారు.
Read Also: Congress: కీలక నిర్ణయం.. నియామక ప్రక్రియకు స్వస్తి..!
Also Read
మరోవైపు, బీజేపీ, టీఆర్ఎస్‌పై మండిపడ్డారు రేవంత్‌రెడ్డి.. ఒకరి దొంగ తనం ఒకరి దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.. ఎవరైనా బయట పెట్టారా..? అని ప్రశ్నించారు.. బీజేపీ, టీఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నాయన్న ఆయన.. కేంద్రంలో అవినీతి బయట పెడతా అంటే ఎవరు వద్దని అన్నారు? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.. రఫెల్ మీద మేం మాట్లాడినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లడలేదని నిలదీసిన ఆయన.. ఇద్దరూ తోడు దొంగలు.. ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుని బతకాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ మాకు సమాన దూరం.. మా ఇంటి కాకి కేసీఆర్ ఇంటి మీద వాలదు.. వాలింది అంటే కాల్చి పడేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
- Tags
- cm kcr
- revanth reddy
- telangana
- TPCC
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!