Harish Rao: కేసీఆర్ కారణజన్ముడు.. తెలంగాణ ఆదర్శంగా నిలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.. ప్రాజెక్టులు నిర్మాణం అయ్యేవి కావు.. నీళ్లు వచ్చేవి కావు.. ఆయన కారణజన్ముడు అంటూ ప్రశంసలు కురిపించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ ను అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు.. 7 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిపారని.. కేంద్రం అనేక షరతులు, నిబంధనలు పెడుతూ.. ప్రాజెక్ట్ లకు నిధులు రాకుండా అడ్డు పడుతుందని మండిపడ్డారు.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, REC నుంచి అప్పుగా నిధులు రాకుండా అడ్డు పడుతుందని ఆరోపించిన ఆయన.. అత్యుత్తమ ఆర్థిక విధానాలతో ఏడేళ్లలో తెలంగాణ జీఎస్‌డీపీని రెట్టింపు చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపారు.. అసలు కేసీఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణ లేదు.. తెలంగాణ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు… రంగనాయక సాగర్ జలాశయం ఉండేది.. సిద్దిపేట ప్రాంతానికి సాగు జలాలు వచ్చేవి కావన్నారు హరీష్‌రావు.
Read Also: TTD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు పెంపు
Also Read
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
నియోజక వర్గ రైతాంగానికి నీళ్లు వదలడం చాలా సంతోషంగా ఉందన్నారు హరీష్‌రావు.. ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్న ఆయన.. ఒకప్పుడు తెలంగాణ గుక్కెడు తాగునీటి కోసం కష్టాలు పడ్డది నేడు సాగునీరు ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా, ప్రాజెక్ట్‌లకు అడ్డుపడుతున్నా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.. సిద్దిపేటతో పాటు సిరిసిల్ల, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు నీరు అందిస్తామని తెలిపిన హామీ ఇచ్చిన హరీష్‌రావు.. రైతాంగానికి బంగారు పంటలు పండే నీరు అందిస్తున్నారు అంటూ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.. గతంలో రైతులు చెమట చుక్కలతో కష్టపడి సంపాదించిన డబ్బు బోరు బావులకే సరిపోయేదని.. గత ప్రభుత్వాల హయాంలో కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లతో అప్పుల పాలు అయ్యేవారని గుర్తుచేశారు.. కలలో కూడా ఊహించలేదు గోదావరి నీళ్లు వస్తాయని.. కానీ, అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అయ్యిందని.. రాష్ట్ర ప్రజల పక్షాన సీఎం కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు మంత్రి హరీష్‌రావు.
తాజావార్తలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?