తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, ఆ వివాదాల పరిష్కారానికి కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం మరోసారి భేటీ కానుంది… రేపు ఉదయం వర్చువల్ విధానంలో కమిటీ సభ్యులు సమావేశం కాబోతున్నారు.. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ సాగనుంది.. ఆ నీటిని వినియోగించుకోవద్దు, నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించుకోవద్దని కేఆర్ఎంబీ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే కాగా.. ఈ సమావేశంలో నీటి కేటాయింపులపై చర్చ జరగనుంది.
Read Also: Raghav Chadha: ఆమ్ ఆద్మీయే ప్రత్యామ్నాయం.. ఫ్యూచర్ పీఎం కేజ్రీవాల్..!