తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. శుక్రవారం నాడు మేడారం జాతరకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని అమ్మవార్లను కోరుకున్నట్లు వెల్లడించారు. గతంలో తాను కోరుకున్న కోర్కెలను అమ్మవారు తీర్చారని.. ఇప్పుడు కూడా తన కోరికను అమ్మవార్లు తీరుస్తారని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా సమ్మక్క…
ఉప్పు-నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గంటల తరబడి మాట్లాడేసుకున్నారు కూడా. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకున్నారు? చర్చకు వచ్చిన అంశాలేంటి? పార్టీలో చాలా ఘర్షణల తర్వాత కలిసిన ఇద్దరు నాయకులు.. మనసులో మాట బయట పెట్టేసుకున్నారా? పార్టీ వ్యవహారాలపై ఏం మాట్లాడుకున్నారు?తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఒక సంచలనం. రెండున్నర గంటలకుపైగా జరిగిన భేటీలో ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటనే ఆసక్తి పెరుగుతోంది.…
ఆయన చేసే కామెంట్స్ విపక్షాలకు అస్త్రాలుగా మారితే.. సొంత పార్టీ ఇరుకున పడుతోందా? సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? మీడియా అటెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్‌పై రచ్చదేశంలో ఉత్తరప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని.. కొత్తగా పాగా వేయాలని బీజేపీ అధిష్ఠానం వేయని ఎత్తుగడలు లేవు. ప్రధాని మోడీ, అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్, జేపీ నడ్డాలు…
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్.. మళ్లీ రాష్ట్రాల పర్యటన మొదలుపెట్టనున్నారు. ఈనెల 20న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంతో సమావేశం కానున్నారు. త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం సన్నాహాలు జరుగుతుండగా.. మాజీ ప్రధాని దేవెగౌడను కూడా భేటీకానున్నారు. మహారాష్ట్ర సియం ఉద్దవ్ థాకరే టిఆర్ఎస్ అధినేత కేసియార్‌కు ఫోన్ చేశారు. ఈనెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. బిజెపికి వ్యతరేకంగా కేసియార్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరల్ స్ఫూర్తి కోసం ప్రజా వ్యతిరేక విధానాలను…
మేషం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉపాధ్యాయులకు మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వృషభం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో అందరినీ ఆకర్షించగలుగుతారు. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు…
తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. మేడారం జాతరకు భారీ ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు రాష్ట్రం మొత్తానికి కాకుండా కేవలం వరంగల్, పెద్దపల్లి జిల్లాలకే వర్తించనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సెలవు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వరంగల్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సెలవులపై ప్రకటన చేశారు. మేడారం జాతర సందర్భంగా వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో శుక్రవారం…
తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అన్ని చోట్ల కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్ ప్రత్యేక అభిమానం చాటుతూ దేశంలోనే తొలిసారిగా బోటుపై బ్యానర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కన ప్రత్యేకమైన బోటులో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ…
తెలంగాణలో కరోనా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 41,310 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 453 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 1,380 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారిఉ.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,746 యాక్టివ్ కేసులు ఉండగా… మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 7,85,596కు, రికవరీ కేసులు 7,74,742కు పెరిగాయి.. మరోవైపు కోవిడ్…
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటనలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.. ఇక, కొన్ని సందర్భాల్లో బీజేపీ ప్రజా ప్రతినిధుల పర్యటనలను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న సందర్భాల్లో కూడా ఉన్నాయి.. కొన్ని సార్లు, దాడులు, ప్రతిదాడులకు కూడా దారితీశాయి.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు…