నేడు కర్ణాటక బంద్‌కు ముస్లిం సంఘాల పిలుపు.. హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్నాయి ముస్లిం సంఘాలు
నేడు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ దీక్ష.. హైకోర్టు సూచనను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేరుతో బీజేపీ దీక్ష, అనుమతి ఇవ్వని పోలీసులు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నేడు సత్య సాయి శ్రీగిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు.
అనంతపురం జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారి బ్రహ్మగరుడ సేవ నిర్వహించనున్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతోన్న పోరాటం.. నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న జాయింట్ యాక్షన్ కమిటీ
తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు, ఇవాళ తెప్పలపై ఏడు ప్రదక్షణములుగా విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
తిరుమలలో రేపు తుంభురు తీర్ద ముక్కోటి… ఇవాళ నుంచి భక్తులును అనుమతించనున్న టీటీడీ
నేడు విశాఖ పబ్లిక్ లైబ్రరీలో అఖిల పక్ష కార్మిక సంఘాల సమావేశం… ఈనెల 28న తలపెట్టిన బంద్ కార్యాచరణపై చర్చ
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో శ్రీ లక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాలలో నేడు శేషోత్సవం
శ్రీశైలంలో నేటి సాయంత్రం దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ
కరీంనగర్ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం 1,030 కోట్ల తో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. మధ్యాహ్నం మార్కుఫెడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ.. చొప్పదండీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న కేటీఆర్.