కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పక్కా… వెనక్కి తగ్గేదేలేదని కుండబద్దలు కొట్టేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాసిన ఆయన.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా, కానీ, 3-4 రోజులు టైం తీసుకొని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారు.. అందుకే ఆగానని.. సమయం తీసుకున్నా రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్నారు.. ఎవరికీ భయపడేది లేదు, ఎవరికీ…
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ నగర శివారులోని శంకర్ పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని హైకోర్టులో చిన్ని కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసినందుకు.. తనపై కొందరు దాడికి యత్నించారని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో చిన్ని కృష్ణ శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్…
దక్షిణాదిలో కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా కారణంగా ఈ ఏడాది జాతర ఉంటుందో లేదో అన్న అనుమానంతో మూడు నెలల ముందు నుంచే భక్తులు మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు రాకపోకలు సాగించారు. ఈనెల 16న జాతర ప్రారంభమయ్యే నాటికి 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది…
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ మేడారం జాతరకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… సీఎం, పీఎం మేడారం జాతరను చిన్నగా చేసి చూపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ఆయన.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ ది భిన్నత్వంలో ఏకత్వం… ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం అంటూ ఎద్దేవా చేసిన ఆయన..…
తెలంగాణలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. అధిష్టానానికి లేఖరాసిన ఆయన.. పార్టీలో ఉన్న పరిస్థితిని.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. పరోక్షంగా టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారు.. ఇక, ఈ లేఖ రాసిన వెంటనే.. తాను కాంగ్రెస్ గుంపులో లేను అంటూ పేర్కొని చర్చకు తెరలేపారు.. త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే,…
ప్రచారం జరుగుతున్నట్టుగానే టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసిన ఆయన.. ఇక, ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేను అని పేర్కొన్నారు.. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని పేర్కొన్న ఆయన.. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని పేర్కొన్న జగ్గారెడ్డి… త్వరలోనే…
ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. ఫిబ్రవరి 14 వరకు ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. మళ్ళీ ఢిల్లీ రావడం సంతోషంగా ఉందన్న ఆయన తనకున్న అనుభవం ద్వారా రాష్ట్ర పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేరుస్తా అన్నారు. ప్రధాన మంత్రి గతి శక్తి యోజన లో భాగంగా తెలంగాణ లో 5…
పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం, భారతీ నగర్ డివిజన్ల పరిధిలో బస్తీదవాఖానాలను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. బస్తీల్లో పేదల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ దవాఖానాల్లో నిపుణుడైన MBBS డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది మీకు వైద్య సేనలు అందిస్తారు.ఉచితంగా వైద్య సేవలు, అన్ని…
మేషం :- ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం. అకాల భోజనం, శారీరకశ్రమ, మితిమీరిన ఆలోచనల వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఏ విషయానికి కలిసిరాని సోదరీ సోదరుల ధోరణి అసహనం కలిగిస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. స్త్రీలు ధనవ్యయం విషయంలో జాగ్రత్త వహించ వలసి ఉంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ కదలికలపై నిఘా…
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మెడికల్ లీవ్‌లోకి వెళ్తున్నారు.. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మెడికల్ లీవ్‌లో ఉండనున్నారు మహేందర్ రెడ్డి.. ఎడమ భుజానికి స్వల్ప గాయం, శస్త్రచికిత్స కారణంగా మెడికల్ లీవ్‌లోకి వెళ్లారు తెలంగాణ పోలీస్ బాస్.. దీంతో మహేందర్ రెడ్డి స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను అంజనీ కుమార్‌కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీ కుమార్ ఈమధ్యే బదిలీ అయ్యారు.. ఆయనను ఏసీబీ డీజీగా…