ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. ఇతర పక్షాలను కూడా కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక, ఇవాళ బంగారు భారత దేశాయాన్ని తయారు చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు కేసీఆర్.. నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన ఆయన.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు…
జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది.. దీనిపై స్పందించిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జగ్గారెడ్డి ఇష్యూ మా దృష్టికి వచ్చింది.. మా పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారు.. జగ్గారెడ్డి మా నాయకుడు.. మా అధిష్టానం అపాయింట్ మెంట్ కోరారు.. జగ్గారెడ్డికి మేమంతా అండగా ఉంటామని.. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.. గతంలో సీనియర్ నేత వీహెచ్‌పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని.. ఆరా…
కోవర్టులు.. అంతర్గత కుమ్ములాటలు.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో వీటి డోస్ ఎక్కువే. పార్టీ చీలికలు.. పేలికలు అయిపోయింది. హస్తం పార్టీని బలోపేతం చేయాలనే సంగతి పక్కనపెట్టి.. టికెట్ కోసం ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్నారు నాయకులు. నేతల్లో సఖ్యత కరువు.. కేడర్ పక్కచూపులుమహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్లో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నాయకత్వ లేమి, నేతల వర్గపోరు, కోవర్టు రాజకీయాలు ఎక్కువయ్యాయి. పార్టీని ట్రాక్‌లో పెట్టడం…
మన బ్యాంకులో ఎంత మొత్తం వుందో మనకు తెలుసు. అలాగే మన బ్యాంకులోకి ఎప్పుడు డబ్బులు వస్తాయో కూడా మనకు తెలుసు. కానీ హఠాత్తుగా లక్షలు కాదు కోట్ల డబ్బులు వచ్చిపడితే పరిస్థితి ఎలా వుంటుంది. అలాంటి అనుభవం ఓ రైతుకి కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు కిసాన్ క్రెడిట్ ఖాతాలోకి ఏకంగా రూ. 60 కోట్ల డబ్బులు జమ కావడం చర్చనీయాంశం అయింది. అతనితో పాటు మరో ఇద్దరి ఖాతాల్లో రూ. లక్షల్లో డబ్బు…
మేషం :- వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అవుతుంది. విదేశీ ప్రయాణాలు నిరుత్సాహ పరుస్తాయి. మీరు ఇతరులతో సంభాషించడం మంచిది కాదని గమనించండి. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ కనపరుస్తారు. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో కొంత చికాకులు తప్పవు. వృషభం :- చేపట్టిన వ్యాపారాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. దుబారా ఖర్చులు నివారించటం సాధ్యపడక పోవచ్చు. ఒక సమస్య పరిష్కారం…
తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీద ఉన్నారు. ఈ మేరకు వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల జనగామ, యాదాద్రి జిల్లాలలో పర్యటించిన కేసీఆర్.. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు ఎత్తి పోతల పథకాలను ఆయన ప్రారంభించనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర అనే రెండు ప్రాజెక్టు నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో నారాయణ ఖేడ్, జహీరాబాద్, ఆందోల్తో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాల ప్రజలకు…
రాష్ట్రంలో రాజకీయంగా ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. బహుజనులు బాగుపడాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బంజారా బిడ్డలే అత్యాచారానికి గురవుతున్నారు. నక్కలగండి ఎస్సెల్బీసీ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులు సెక్యూరీటీ గార్డులుగా పనిచేస్తున్నారన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం జీతం 4, 25 లక్షలు వుంటే మాస్ గిరిజన బిడ్డలు…
✪ నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం✪ నేడు విశాఖ తూర్పు నావికాదళం ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ.. పాల్గొననున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఐఎన్ఎస్ సుమిత్ర నౌక ప్లీట్ రివ్యూలో పాల్గొననున్న రాష్ట్రపతి.. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో పాల్గొననున్న రాష్ట్రపతి.. ప్రెసిడెంట్ పదవీకాలంలో ప్లీట్ రివ్యూ చేయడం ఆనవాయితీ✪ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష✪ విజయవాడ: నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10…
ముంబై పర్యటనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. 1969 ఉద్యమ సమయం నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్‌ది అని కొనియాడారు. దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశం ప్రస్తుతం…
ముంబై పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయాలపై మహారాష్ట్ర సీఎంతో చర్చించినట్లు తెలిపారు. దేశ రాజకీయాలపై చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చానని.. దేశంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమే అని సీఎం…