ప్రేమ కోసం చంపడానికైనా.. లేదా చావడానికైనా సిద్ధపడుతున్నారు నేటి రోజుల్లో. కొందరు యువతీ యువకులు ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విడిపోయి బ్రతకలేమని తనువులు చాలిస్తున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు సేవించి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. బీబీనగర్ (మ) కొండమడుగు రాగాల రిసార్ట్స్ లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని…
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ ను అరెస్టు చేసిన పోలీసులు జడ్జి ముందు హాజరుపర్చారు. పూర్ణచందర్ కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పూర్ణ చందర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. పూర్ణ చందర్ కన్ఫషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. కన్ఫషన్ స్టేట్మెంట్ లో రాజకీయ నాయకుడి పేరు వెల్లడించినట్లు తెలుస్తోంది. తనకు సంబందించిన అన్ని విషయాలు ఒక రాజకీయ నాయకుడికి తెలుసని పూర్ణ…
ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ బలవర్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా తమ కూతురు ఆత్మహత్యకు పూర్ణ చందర్ నాయక్ కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో పూర్ణ చందర్ స్వేచ్ఛకు తనకు మధ్య ఏర్పడిన పరిచయం గురించి వెల్లడిస్తూ లేఖ విడుదల చేశారు. స్వేచ్ఛ నాకు 2009 నుంచి పరిచయం. మేము…
ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ నిన్న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే తన బలవన్మరణానికి పూర్ణచందర్ కారణం అని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ సంచలన లేఖ రాశారు. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం. ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్చా బలవన్మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవలసిన కొన్ని నిజాలు – నేను మీడియా ద్వారా ప్రజలకు…
బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. జులై ఒకటిన పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన ఉంటుంది. నెలల తరబడి పేరుకుపోయిన నైరాశ్యం, కేడర్లో అసహనం, ఆశావహుల నిష్టూరాల్లాంటి వాటన్నిటికీ తెరపడబోతోంది. కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంలో.... రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంలో కేంద్ర పెద్దలు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడే ఓ కొత్త చర్చ మొదలైంది రాష్ట్ర పార్టీ వర్గాల్లో.. ఢిల్లీ పెద్దోళ్లు…
ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. అయితే... తెలంగాణలో వ్యవహారం కాస్త డిఫరెంట్గా ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మొదట ఈ ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని...కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. కానీ... ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి రివర్స్ అటాక్ మొదలవడంతో మేటర్ రసకందాయంలో పడిందని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో సమావేశం పెట్టింది సర్కార్.
మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మెట్ పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాలు ఊడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్ పల్లి పర్యటన ముగించుకుని ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమి కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరో వాహనంలో వెళ్లిపోయారు. కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు.. కోరుట్ల డిఎస్పీ.. ప్రమాద స్థలాన్ని…
ప్రభుత్వ స్థలాలు, చెరువులు,నాళాలు, బఫర్ జోన్ లోని స్థలాలు కబ్జాల బారి నుంచి కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా చర్యలతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటే నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైడ్రా స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేసిన 3 గంటల్లోనే హైడ్రా పరిష్కారం చూపింది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామం సర్వే నెంబర్ 218, 214లో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్ కు చెందిన పార్కును కాపాడింది.…
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మానవ అక్రమ రవాణా కలకలం రేపుతోంది. ఇటీవల కొమురం భీమ్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసులో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికను అమ్మేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిని పక్క రాష్ట్రానికి అమ్మిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్ కోటా ఏరియాలో ముఠా…