తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేనా అనే చర్చ నడుస్తోంది. రాష్ట్రం పంపిన బిల్స్ కేంద్రం ఆమోదించే పరిస్థితి కనబడటం లేదు. రాష్ట్రపతి ఆమోదం లేకుండా రిజర్వేషన్లు పెంచే పరిస్థితి రాష్ట్రంలో లేదు. మరి ఇంత చేసిన తెలంగాణ సర్కార్ ఇక ఏం చేయబోతుందనేది సర్వత్రా చర్చాంశనీయంగా మారింది.
రాహూల్ హామీ ఇచ్చారంటూ, దాన్ని అమలు చేసే బాధ్యత మాదే అంటూ తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో కుల గణన చేసింది. జనాభా లెక్కలతో పాటూ పలు కీలక అంశాలను సర్వే పేరుతో సేకరించింది. ప్రాసెస్ మొత్తం కూడా శాస్త్రీయంగా చేశామన్న రేవంత్ సర్కార్. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాజకీయాలతో పాటూ విద్య, ఉపాధిల్లో కల్పించేందుకు సిద్దం అంటూ క్యాభినేట్లో తీర్మాణం చేశారు. తర్వాత అసెంభ్లీలో బిల్ పెట్టారు. ఉభయ సభల్లో ఆమోదించిన రెండు భిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు.
అయితే నాలుగు నెలలవుతున్నా రాష్ట్ర పతి ఆమోదించలేదు, బిల్లులను తిప్పి పంపలేదు. మరోపక్క 2018లో అప్పటి సర్కార్ రిజర్వేషన్ల విషయంలో చేసిన క్యాప్ ను తీసేందుకు ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ కూడా ఆమోదం కాలేదు. దాంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ ఎంపీలతో పాటూ, ఇండియా కూటమి ఎంపీల మద్దతు కూడగట్టారు. అంతేకాదు ఢిల్లీ జంతర్ మంతర్ లో బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు..అయితే ధర్నా ముగిసాక రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. కానీ రాష్ట్రపతి అపాయంట్మెంట్ ఇవ్వలేదు.. దాంతో మోడీ సర్కార్ బీసి రిజర్వేషన్లు అమలుకు అడ్డం పడుతుందని ఆరోపించారు. ఇక ఢీల్లీ వదిలి రాష్ట్రంలోనే ఏం చెయ్యాలనే దానిపై డిసైడ్ చేస్తాం అంటున్నారు సీఎం.
Also Read: Kapil Dev: కామెంటరీ, ఎండార్స్‌మెంట్, రియల్ ఎస్టేట్.. కపిల్ దేవ్ వార్షిక ఆదాయం ఎంతో తెలుసా?
రిజర్వేషన్ల కోసం కేంద్రంపై చేసిన ఒత్తడితో ఎటువంటి ఫలితం రాకపోవడంతో ఇక ఏం చెయ్యాలనే దానిపై కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్. రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించనున్నారు. మరోపక్క బీసి రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయి నుంచి ఆందోళనలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి బీసి రిజర్వేషన్ల విషయంలో పడిన పుల్ స్టాప్ ను తొలగించేందుకు ఎటువంటి అడుగులు పడుతాయో చూడాలి.