* నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. అల్లూరి జిల్లా పాడేరులో ఆదివాసీ దినోత్సవానికి హాజరకానున్న సీఎం చంద్రబాబు.. గిరిజనులకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు, కాఫీ పంట మార్కెటింగ్ పై సీఎం చంద్రబాబు ప్రసంగం..
* నేడు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన.. భగత్ సింగ్ కాలనీవాసులకు వర్చువల్ గా పట్టాలు అందజేయన్న సీఎం చంద్రబాబు.. మొదటి విడతలో 650 మందికి పంపిణీ, మిగిలిన వారికి రెండో విడతలు ఇస్తామంటున్న మంత్రి నారాయణ..
* నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్ లో వెళ్లి కలువనున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.. తిరుపతి ఎంపీతో పాటు ములాఖాత్ కు వెళ్లనున్న మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు..
* నేటి నుంచి కర్నూలులో 11వ తేదీ వరకు సీపీఐ జిల్లా మహాసభలు.. హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వర్ రావు..
* నేడు గుంతకల్లు రైల్వే డివిజన్ లో సాంకేతిక సమస్యలతో గుంతకల్లు-తిరుపతి, కదిరిదేవరపల్లి- తిరుపతి, బాగల్ కోట్- మైసూర్ రైళ్లును తాత్కాలికంగా రద్దు చేసిన అధికారులు..
* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన..
* నేడు ఖమ్మంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు.. పాల్గొననున్న RTI కమిషనర్ పీవీ శ్రీనివాస్
* ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు..
* నేటి నుంచి మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు.. నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్.. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, జనగాం, సూర్యాపేట, హన్మకొండ..
* నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి..