TRS Protest: గల్లీలో ముగిసింది.. ఇక ఢిల్లీలో పోరు.. కేసీఆర్ రైతు దీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో.. వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధం అయ్యింది.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టబోతున్నారు.. కేంద్రం ధాన్యం కొనాలంటూ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగుతోంది టీఆర్ఎస్ పార్టీ… ధాన్యం సేకరణ కోసం దేశ వ్యాప్తంగా ఓకే పాలసి ఉండాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టనున్నారు.. తెలంగాణ రైతుల పక్షాన హస్తినలో ప్రజా ప్రతినిధులు దీక్షకు పూనుకున్నారు.. దీక్షలో పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొనబోతున్నారు..
Read Also: New Cabinet: ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులు.. వారికే అవకాశం..?
Also Read
- Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
- Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
వడ్లను అడ్డుపెట్టుకొని అడ్డమైన రాజకీయాలకు చేసేందుకు బీజేపీని ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ మండిపడుతోంది.. సీఎం కేసీఆర్ సహా యావత్తు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఢిల్లీ దీక్ష ద్వారా.. మేం బాయిల్డ్ రైస్ బాధితులం కాబోమంటూ కేంద్రానికి అల్టిమేటం జారీ చేసేందుకు సిద్ధం అయ్యారు.. ఇప్పటికే నిరసన దీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. దీక్ష పర్యవేక్షణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, పార్టీ శాసనసభ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్‌రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పూర్తిచేశారు. పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేశారు. ఎండత తీవ్రత దృష్ట్యా.. దీక్షా స్థలి వద్ద కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు.. దీక్షకు వచ్చేవారందరికీ మజ్జిగ, మంచినీళ్లు, భోజనం ఏర్పాట్లు కూడా చేశారు..
తాజావార్తలు
-
Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
-
Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!