భూ వివాదంలో హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే… మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా భూ వివాదానికి లింక్ అయ్యే ఉందని చెబుతున్నారు పోలీసులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి… తొగుట మండలం వెంకట్రావుపెట్ – జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు తిరుపతి – వంశీ…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభమైన తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించడంపై నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ల ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ తీర్మానం పెట్టడం.. దానికి స్పీకర్ అంగీకరించడం జరిగిపోయాయి. అయితే, దీనిపై న్యాయపోరాటానికి దిగారు బీజేపీ ఎమ్మెల్యేలు.. తమ సస్పెన్షన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు.. ఆ…
తెలంగాణలో కొత్తగా 80వేల ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఈ అంశంపై స్పందించారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే సీఎం కేసీఆర్ ఈరోజు ఈ ఉద్యోగ ప్రకటన చేశారని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని.. కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసీఆర్ వల్లే రాలేదని.. అందరి త్యాగాల…
తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలతోనే నిరుద్యోగ నిర్మూలన సాధ్యంకాదు. ఒకేసారి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. రాష్ట్ర…
తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ అంశంపై స్పందించారు. ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తడబడిన సందర్భమే లేదని.. ఇప్పటికే 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పనకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని ఆమె స్పష్టం చేశారు. అటు కేంద్రంలో ప్రధాని మోదీ రెండు కోట్ల…
ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు సాధించుకున్నట్లే ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. ఇందులో భాగంగా 80,039 ఉద్యోగాలకు బుధవారం నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని తెలిపారు. ఇకపై వివిధ శాఖలలో ఖాళీలను ముందే గుర్తించి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాలు…
తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని ఈరోజు నుంచే నోటిఫై చేస్తున్నామన్నారు. అందులో 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే శాఖల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులే పొందుతారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పోలీస్…
తెలంగాణ ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో తానూ కూడా లాఠీదెబ్బలు తిన్నానని తెలిపారు. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్నివిధాలుగా అన్యాయానికి గురైందని సీఎం కేసీఆర్ అన్నారు. సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ భాషను కమెడియన్లకు వాడేవారని.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష వాడితేనే హీరో క్లిక్ అవుతున్నాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా…
తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84 శాతం) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75 శాతం) కంటే ఇది దాదాపు 12 శాతం అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా మరో 10.48 శాతం పెరిగి 2.20 కోట్లకు చేరుతుందని నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అధికారులు భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా…