వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్‌ఎస్ సర్కార్.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు చేస్తోంది.. ఇప్పటికే వివిధ రూపాల్లో గ్రామస్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆ పార్టీ ఇప్పుడు.. హస్తిన వేదికగా ఢిల్లీపై యుద్ధం ప్రకటించింది.. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని.. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ దీక్షలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతులకు చెమట చిందించటమే కాదు.. కేంద్ర ప్రభుత్వానికి చెమట పట్టించడం తెలుసుని హెచ్చరించారు..
Read Also: Botsa Satyanarayana: మంత్రివర్గ కూర్పు అద్భుతం.. సమన్వయంతో ముందుకెళ్తాం..
కేంద్ర మంత్రితో చర్చలకు వెళ్తే అవమానించేలా మాట్లాడుతున్నారు.. నూకల బియ్యం మీ ప్రజలకు పెట్టండి అంటూ అవహేళన చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. రైతుల విషయంలో వ్యాపార దృక్పథంతో ఆలోచించకూడదు.. చెమటోడ్చి కష్టపడ్డారు.. తెలంగాణ రైతులు పంజాబ్‌ను తలదన్నేలా పంట దిగుబడి సాధించారని తెలిపారు.. ఇది గర్వించాల్సిన విషయం.. ఇదంతా కేసీఆర్ దార్శనికత ఫలితమన్న ఆయన.. కేవలం కొనే విషయంలోనే బాధ్యత కల్గిన కేంద్రం, ఆ పని చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.. చెమటోడ్చి కష్టపడడమే కాదు, కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా రైతులకు తెలుసన్నారు.. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చెంపలేసుకుని, రైతుల క్షమాపణ కోరిన నీతిమాలిన సర్కారు బీజేపీది అంటూ ఎద్దేవా చేశారు.. కనీస మద్ధతు ధర కోరుతూ నాడు సీఎంగా మోడీ కేంద్రానికి పంపిన ఫైలు, ఇప్పటికీ ప్రధాని టేబుల్ దగ్గరే పెండింగులో ఉందని విమర్శించారు మంత్రి నిరంజన్‌రెడ్డి. ఢిల్లీలో దీక్ష చేయడం మనకు సంతోషం కాదు. కానీ ఇలాంటి అనివార్య పరిస్థితులు కల్పించింది కేంద్రం అని మంత్రి మండిపడ్డారు. కేంద్ర మోసపూరిత వైఖరిని గ్రహించిన కేసీఆర్.. రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. వానాకాలం పంటను కొనే సమయంలోనే యాసంగి పంటను కొనమని బీజేపీ చెప్పిందన్నారు..