తెలంగాణలో తమ వాహనాలపై పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్ ముగియవచ్చింది.. ఈ నెల 15వ తేదీతో ముగియనుంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ఇచ్చిన డిస్కౌంట్‌కు ఇక మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న చలాన్‌లకు ఇచ్చిన డిస్కౌంట్ క్లియర్ చేసే సమయం 15-4-2022 సాయంత్రంతో ముగుస్తుంది. ఇకపై ఈ అవకాశం మళ్లీ పొడిగించే అవకాశం లేదు కాబట్టి.. తమ వాహనాలపై ఉన్న చలాన్స్ క్లియర్ చేసుకోవాలని.. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధువులకు తెలియజేయాలని సూచిస్తున్నారు పోలీసులు.
Read Also: Weather Update: తెలంగాణకు వర్ష సూచన..
కాగా, ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్లలో భాగంగా.. టూ వీలర్/ త్రీ వీలర్ వెహికల్స్ పై ఉన్న చలాన్లపై 75 శాతం డిస్కౌంట్ ప్రస్తుతం అందుబాటులో ఉండగా… ఫోర్ వీలర్ , హెవీ వెహికల్స్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్, కరోనా సమయంలో మాస్కు పెట్టుకోని కారణంగా వేసిన కేసులలో 90 శాతం డిస్కౌంట్ ఇచ్చింది.. ఇక, ఆటోలపై ఉన్న చలాన్లు 70 శాతం డిస్కౌంట్ తో క్లియర్ చేసుకునే అవకాశం ఉంది.. మరో మూడు రోజుల్లో ఈ డెడ్‌లైన్ ముగియనుండడంతో వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ఈ అవకాశాన్ని నెట్ బ్యాంకింగ్ లేదా పేటియం ద్వారా.. మీ దగ్గరలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి గాని మీ వెహికల్ పై ఉన్న పెండింగ్ చలాన్స్ ను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.