తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి.. ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు.. అయితే, తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.. ఇక, ఎల్లుండి ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో వర్షం పడుతుందని.. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది వాతావరణ కేంద్రం.
Read Also: Palla Rajeshwar Reddy: బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ రాజేశ్వర్‌రెడ్డి..