మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ . నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణలో పోతున్న యాభై ఏళ్ళకు పైబడ్డ వృక్షాలకు తిరిగి పునరుజ్జీవం పోస్తున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు. నల్లగొండ మున్సిపల్ కమీషనర్ రమణాచారి విజ్ఠప్తిని మన్నించి రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమానికి పూనుకున్నారు. మంగళవారం ఉదయం నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్…
https://www.youtube.com/watch?v=b1OI3uOdmMU ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… మంగళవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… రేపు అల్వాల్ లో పర్యటించనున్నారు. రైతు బజార్ ఎదురుగా టిమ్స్ హాస్పిటల్ నిర్మాణనానికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుమల గిరి ఎక్స్ రోడ్ నుంచి బొల్లారం చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక కరీంనగర్ హైవే చేరుకోవడానికి టివోలి ఎక్స్ రోడ్, బోయిన్ పల్లి, సుచిత్ర,…
తెలంగాణలోనూ ఏ నేత నోట విన్నా ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు వస్తుంది.. ఆయన చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్న, మొన్నా కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ కాగా.. మరోవైపు ఢిల్లీలోనూ పీకే వ్యవహారానికి సంబంధించిన పరిణామాలు జోరుగా సాగాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజేంటేషన్‌పై 8 మంది సభ్యులు… సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. నివేదికపై కూలంకుషంగా చర్చించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్…
తెలంగాణలో గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4 పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులు ఉంటాయని తెలిపింది. గ్రూప్-1 పోస్టులకు 900 మార్కులతో… గ్రూప్-2 పోస్టులకు 600 మార్కులతో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. ఇక గ్రూప్-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కులతో పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉండనున్నాయి. గ్రూప్-4లో 300 మార్కులతో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్,…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. అన్న మీద కోపం ఉంటే ఇక్కడ పార్టీ పెట్టడం ఎంటి? అని కేటీఆర్ అంటున్నారు.. నాకు మా అన్న మీద కోపం ఉంటే ఇక్కడ లాభం లేదు అనే ఇంగిత జ్ఞానం ఉంది.. ఆ మాటలో నిజం లేదు కాబట్టే… అక్కడ పార్టీ పెట్టలేదు… ఇక్కడ పార్టీ పెట్టానని సమాధానం ఇచ్చారు. ఇక, బీజేపీతో మాకు పొత్తు…
తెలంగాణలోని ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు.. అయితే, వాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పే విధంగా… ప్రమోషన్ల ఇప్పటి వరకు ఉన్న మరో అడ్డంకి కూడా తొలగిపోయింది.. పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ పై కోర్టుకు వెళ్లారు ఎస్జీటీలు.. అయితే, ఇప్పుడు కేసును ఉప సంహరించుకునేందుకు సిద్ధమయ్యారు.. ఒకటి, రెండు రోజుల్లో కోర్టులో ఉప సంహరణ పటిషన్ దాఖలు చేయబోతున్నారు.. పండిట్ పోస్టులకు అర్హులైన ఎస్జీటీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా అంటూ వార్తలు వస్తున్నాయి.. వడ దెబ్బకు గురైన బండి సంజయ్.. తన పాదయాత్రకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వనున్నారని వాటి సారాంశం.. అయితే, దీనిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది.. బండి సంజయ్ రెండో విడత ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ రెండ్రోజుల పాటు వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది… ప్రజా సంగ్రామ యాత్ర యథావిథిగా కొనసాగుతుందని…
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ ఇక, వరుసగా నోటిఫికేషన్లు ఉంటాయంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.. అయితే, కొంత గ్యాప్ వచ్చినా.. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది సర్కార్.. ఇప్పటికే హోంశాఖ సహా.. ఇతర కొన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు తీపికబురు చెబుతూ.. పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్.. కానిస్టేబుళ్లు,…
తెలంగాణలో మరోసారి పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దానికి ప్రధాన కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనే చెప్పాలి… ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహాలు రచిస్తున్న పీకే.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం గట్టిగానే సాగుతోంది.. కొందరు సీనియర్ నేతల మాటలు చూస్తుంటే.. పీకే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇదే సమయంలో.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని..! ఏకంగా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం కాబోతోందంటూ…