టెర్రరిస్టులు ఆదిలాబాద్ ను సేఫ్ జోన్ గా భావిస్తున్నారా? పోలీసులను పక్కదారి పట్టించేందుకే ఆదిలాబాద్ పేరెత్తుకున్నారా? ఇంతకీ ఆదిలాబాద్ లొకేషన్ ఎందుకు చెప్పారనే దానిపై నిఘా వర్గాల ఆరా ముమ్మరం అయింది. వాస్తవంగా ఖలిస్తాన్ కు ఇక్కడ నెట్ వర్క్ ఉందా? ఉంటే ఎవ్వరు…స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయా? ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే పసిగట్టలేదా? ఇంతకీ హర్యానాలో పట్టుబడ్డ ఉగ్ర ముఠా ప్లానేంటి? కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తు ఎక్కడికొచ్చింది..రాష్ట్ర పోలీస్ విభాగం ఏం ఆరా తీస్తోంది?
హర్యానాలో మూడు రోజుల క్రితం అనుమానిత ఉగ్రవాద ముఠా సభ్యులు నలుగురు పట్టుబడ్డారు. వారితో పాటు పేలుడు పదార్థాలు,ఆయుధాలు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లలో ఆర్డీఎక్స్ ను సైతం సీజ్ చేశారు. పట్టుబడిన వారిని విచారిస్తే ఆయుధాలన్నీ ఆదిలాబాద్ కు తరలిస్తున్నట్టుగా అక్కడి పోలీసులు వెల్లడించారు. ఆదిలాబాద్ పేరు తెరపైకి రాగానే స్టేట్ పోలీసులు అలెర్ట్ అయ్యారు..ఇంతకీ ఆదిలాబాద్ ను ఎంచుకున్నారా?ఎందుకలా చెప్పారు..ఇంతకీ ఖలిస్థాన్ కు ఇక్కడి లింకేంటీ? అలాంటి వారు సైతం ఉన్నారా…అనే దానిపై ఇంటెలిజెన్స్ వారు ఆరా తీస్తున్నారు.
ఆదిలాబాద్ ఆస్ పాస్ అంటూ హర్యాన పోలీస్ అధికారి ఆఒక్కమాటతో తెలంగాణలో అలజడి స్టార్ట్ అయింది..అయితే పాకిస్తాన్ నుంచి పట్టుబడిన నలుగురు సభ్యుల ముఠాకు ఆదిలాబాద్ కు తరలించాలనే ఆదేశాలు వచ్చినట్టుగా చెప్పారంటున్నారు అక్కడి పోలీసులు..అయితే ఆదిలాబాద్ కు నిజంగానే తరలించాలనే ఆదేశాలున్నాయా? లేక పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేయడంకోసం చెప్పారా? అనేది క్లారిటి రావాల్సి ఉంది.
ఆవిషయం కాస్త పక్కన పెడితే వాస్తవంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఆదిలాబాద్ కు ఏం సంబంధం? ఆదిలాబాద్ ను వాళ్లెందుకు పాయింట్ గా పెట్టుకున్నారు..ఇక్కడైతే ఎవ్వరికీ అనుమానం రాకుండా అలా చేసుకున్నారా? ఆదిలాబాద్ మీదుగా నాంథేడ్ కే తరలించాలని భావించారా…లేక ఆదిలాబాద్ లో ఎక్కడైనా డంప్ చేసి వీలును బట్టి తరలించాలని అనుకున్నారో ఏమోకాని ఆదిలోనే ఉగ్రకుట్రను భగ్నం చేశారు అక్కడి పోలీసులు..
సరే పట్టుకున్నారు..కానీ అసలు ఆదిలాబాద్ లొకేషన్ పెట్టడానికి కారణాలేంటనే దానిపై కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది..స్టేట్ పోలీసులు సైతం ఆదిలాబాద్ పేరు రావడంతో అప్రమత్తం అయ్యారు..నిర్మల్ ,బైంసా,అలాగే జాతీయ రహదారులపై నిఘా పెట్టడంతోపాటు కొన్ని చోట్ల సీక్రెట్ గా డాటా సేకరించే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది..అంతేకాదు సోదాలు చేశారు అని ప్రచారం సాగుతోంది..అయితే దీన్ని స్టేట్ పోలీసులు ధృవీకరించడం లేదు..అయితే ఆదిలాబాద్ నుంచి పేలుడు పదార్థాలు ఎక్కడికి తరలించాలన్నా ఈజీ మూవ్ కు అవకాశం ఉంటుందనా…ఆదిలాబాద్ నుంచి అటు మంచిర్యాల ,ఇటు నిర్మల్ మీదుగా బైంసా,అలాగే మహరాష్ట్ర లోని నాంథేడ్ తరలించాలనుకున్నారా?.అక్కడికే అయితే రిసీవర్ ఎవ్వరు…ఇక్కడేమైనా స్లిపర్ సెల్స్ పనిచేస్తున్నాయా? అనేదానిపై నిఘా బృందాలు ఆరా తీస్తున్నాయి..
ఆదిలాబాద్ కు పేలుడు పదార్థాలు తరలించాలనే ఆదేశాలు వచ్చాయని హర్యానా పోలీసులు చెప్పడంతో తెలంగాణ పోలీసుల్లో హైరానా మొదలైంది. ఉగ్ర కుట్రకు ప్లాన్ ఏంటీ? ఇక్కడెవ్వరు. వాటికి ఊతమిస్తున్నారు..ఎవ్వరు సహకరిస్తున్నారు..లేదా ఆదిలాబాద్ పేరుతో ఊరికేనే చెప్పారా అసలు ఏమైందనేది కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడి కానుంది. జిల్లా పోలీసులు మాత్రం దానిపై తమకెలాంటి సమాచారం లేదంటున్నారు. కాకపోతే అక్కడక్కడ తనిఖీలు చేస్తున్నారు..తాజాగా ఇచ్చోడ నుంచి సిరికొండ వైపు మార్గంలో బాంబ్ స్వ్కాడ్ ,డాగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేశాయి.. అయితే అవి సాధారణ తనిఖీలే అని చెప్పుకొస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా రిండా కు ఖలిస్థాన్ కు ఇక్కడ లింకేంటీ అనేదానిపై ముమ్మర దర్యాప్తు అయితే జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది..అధికారికంగా ఎవ్వరు ఏ సమాచారం చెప్పడంలేదు..కాకపోతే హర్యానాలో పట్టుబడ్డ టెర్రరిస్టులు పోలీసు కస్టడీకి తీసుకున్నారు కాబట్టి వారితో పాటు ఎన్ ఐఏ, తెలంగాణ ,మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Asaduddin Owaisi : ఇక్కడ పోటీ చేసీ రాహుల్ అదృష్టాన్ని పరీక్షించుకో..