తెలంగాణలో ఆదివారం పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్ బాడీస్ కు అధికారులుగా ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు కలెక్టర్ గా పదోన్నతి పొందారు. సంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న ఏ. శరత్, సిద్ధిపేట కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్, గద్వాల కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నల్గొండ కలెక్టర్ గా రాహుల్ శర్మ, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా వరణ్ రెడ్డి, ఏటూర్ నాగారం ఐటీడీఏ పీఓ గా అంకిత్ బదిలీ అయ్యారు.
పీఆర్ అండ్ ఆర్డీ కమిషన్ గా ఉన్న. ఏ శరత్ ను కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ గా సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడ కలెక్టర్ గా ఉన్న ఎం. హనుమంతరావును బదిలీ చేసి పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ గా నియమించారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ గా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ ను సిద్ధిపేటకు బదిలీ చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం. హనుమంత రావును రిలీవ్ చేశారు.
నల్గొండ జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గా ఉన్న రాహుల్ శర్మకు నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదోన్నతి కల్పించారు. ఇదే విధంగా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గా ఉన్న కోయ శ్రీహర్షకు జోగులాంబ-గద్వాల్ జిల్లా కలెక్టర్ గా పదోన్నతి లభించింది. ఇప్పటి వరకు గద్వాల జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యత కింద పనిచేస్తున్న యాస్మీన్ బాషాను రిలీవ్ చేశారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఆసిఫాబాద్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న కర్నాటి వరణ్ రెడ్డిని ఊట్నూర్ ఐటీడీఏ పీఓగా టాన్స్ఫర్ చేశారు. ఊట్నూర్ ఐటీడీఏ పీఓగా ఉన్న అంకిత్ ను ఏటూర్ నాగారం ఐటీడీఏ పీఓగా బదిలీ చేశారు.
పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న చాహల్ బాజ్ పాయ్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా కుమ్రం భీం- ఆసిఫాబాద్ కు బదిలీ చేశారు.