Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.24వేల కోట్ల పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్లకు అత్యంత ఆధునికమైన డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (ఎలెస్ట్) అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీ యూనిట్‌ను తెలంగాణలో స్థాపించనుందని.. ఇందుకోసం రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ మేరకు అమెలెడ్ డిస్‌ప్లే యూనిట్ విషయాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకు జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు సాధ్యమైన అరుదైన ఫీట్ ఇకపై ఇండియాలోనూ చోటు చేసుకోబోతుందని కేటీఆర్ తెలిపారు. ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్ల తయారీకీ అవసరమైన ఎకో సిస్టమ్ తెలంగాణలో తయారవుతుందన్నారు. తెలంగాణకు ఈరోజు హిస్టారిక్ డే అని కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణకు వస్తున్న ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా గర్వకారణమన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్‌లో 3వేల మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఛైర్మన్ రాజేష్ మేహత అన్నారు. దీంతో పాటు డిస్‌ప్లే ఫ్యాబ్ భాగస్వాములు, ఈ రంగ అనుబంధం సంస్థలు, సరఫరాదారుల వంటి రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తమ ఎలేస్ట్ కంపెనీ, ఆరో తరం అమోలెడ్ డిస్‌ప్లే తయారీ ద్వారా భారతదేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, ఎలేస్ట్ సీఈవో శ్యామ్ రఘుపతి పాల్గొన్నారు.
Historic day for Telangana😊
Rajesh Exports (Elest), a Fortune-500 company, to setup India's first Display FAB to manufacture the most advanced AMOLED displays, with an investment of ₹24,000 Cr, making it one of the largest investments in high-tech manufacturing sector in India pic.twitter.com/ygb9wK50j4
— KTR (@KTRBRS) June 12, 2022
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!