కొత్తగా చేరే ప్రభుత్వ వైద్యులకు ప్రయివేట్ ప్రాక్టీస్ రద్దు అంశం పై తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్, మెడికల్ టీచింగ్ అసోసియేషన్, IMA, సీనియర్ రెసిడెనెస్ డాక్టర్స్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అసోసియేషన్, హేల్త్ కేర్ రిఫ్సర్మ్స్ డాక్టర్ అసోసియేషన్, ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రయివేట్ వేట్ ప్రాక్టీస్ అంశం ఎవరి అభిప్రాయం తీసుకుకోకుండా ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ప్రైవేటు ప్రాక్టీసు రద్దు వల్ల డాక్టర్లతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్టు బేసిస్ మీద వచ్చే వైద్యులకు లక్షల్లో జీతం, మాకెందుకు లేదు? అని ప్రశ్నించారు. అడ్మినిస్ట్రేషన్ లో చాలా లోపాలు ఉన్నాయని విమర్శించారు. పై స్థాయిలో ఉన్న వైద్య అధికారులు ఏళ్ల తరబడి పదవుల్లో ఉంటున్నారని మండిపడ్డారు. నిమ్స్ డైరెక్టర్ టర్మ్ అయిపోయిన అక్కడే ఉండి.. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రయివేట్ ప్రాక్టీస్ రద్దు వల్ల కొత్తగా వచ్చే డాక్టర్లకు స్కిల్స్ తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులలో పై స్థాయి వైద్యులకు ఉన్న వసతులు, కింది స్థాయి వాళ్ళకి అందడం లేదని వాపోయారు.
ఎలా 24 గంటలు అందుబాటులో ఉండాలి? అని ప్రశ్నించారు. ప్రయివేట్ ఆసుపత్రిలో ఇచ్చిన సాలరీ మాకు ఇవ్వడం లేదు..ఇస్తే దానికి సిద్ధం మని అన్నారు. ఇది ఇలా కొనసాగితే ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టం పాడవుతుందని మండిపడ్డారు. పై అధికారులు చేస్తున్న అరాచకం చాలా ఉన్నాయని ఆరోపించారు. క్వాలిటీ కంట్రోల్, మెడికల్ ఆఫీసర్ లో ఎక్కడ ప్రొఫెసర్, సీనియర్లు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడిసిన్ విషయంలో మాఫియా జరుగుతుందని ఆరోపించారు.
మంత్రి హరీష్ రావు వచ్చిన తరువాత మార్పు మొదలయిందని అన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు వైద్య సంఘాలతో చర్చ చేసుంటే బాగుండేదని జూ.వైద్యులు తెలిపారు. టైం టు టైం పనిచేయడానికి మేము నాన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాదు. మేము ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఉన్నామని నిప్పులు చెరిగారు.
ఎయిమ్స్, నిమ్స్ లాంటి ఆసుపత్రులలో ఎలాంటి వసతులు, జీతాలు ఉన్నాయో మాకు ఇవ్వడానికి సిద్ధం అయితే ప్రయివేట్ ప్రాక్టీస్ రద్దుకు ఒప్పుకుంటామని అన్నారు. మరోసారి చర్చించి జీవోలో మార్పులు చేయాలని డిమాండ్ చేసారు. కొత్తగా వచ్చే వైద్యులకు అప్షన్ ఇవ్వాలని, వాళ్ళు ఒప్పుకుంటే ప్రయివేట్ ప్రాక్టీస్ లేకుండా.. కావాలనుకుంటే ఉండేలా కనీసం అప్షన్ అయిన ఇవ్వాలని వారు ఈసందర్భంగా కోరారు.
Khammam TRS: విభేదాలకు స్వస్తి.. పార్టీ పటిష్టత కోసం కృషి