దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చింది. రాజధానిలో నేడు టెట్, ఆర్‌ఆర్బీ పరీక్షలు ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాల వల్ల 34 ఎంఎంటీఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసుల చొప్పున ఉండగా, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో ఒక్కో సర్వీసు చొప్పున రద్దు చేశారు.
పరీక్షలు రాయడానికి వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులే అని చెప్పాలి. త్వరలో ఎంఎంటీఎస్ ట్రైన్ లో వెల్లొచ్చని భావించే ప్రయాణికులకు షాక్ అనే చెప్పాలి. పిల్లలతో .. కొంతమంది ఎక్జామ్ రాయడానికి వెల్లుతున్న క్రమంలో కొన్ని ప్రాంతాలలో ఎంఎంటిఎస్ అందుబాటులో వుందనే ఆనందం వున్న టెట్ విద్యార్థులకు ఎంఎంటీఎస్ రద్దుతో తీవ్ర ఇబ్బందే అని చెప్పాలి. ఎండకు బైక్ వెళ్లలేక, బస్సు రేట్టు పెంచడంతో .. ఇక మెట్రో దారి పట్టేందుకు సమాలోచనలో పడ్డారు విధ్యార్థులు. ఏది ఏమైన ఇవాల టెట్ పరీక్షలు జరుగునున్న నేపథ్యంలో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొక తప్పదనే తెలుస్కోంది.
గత మాసం మే నెల 29న (ఆదివారం) ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండడంతో పలు మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ల మధ్య 18 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి 14, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 చొప్పున సర్వీసులు రద్దయ్యాయి. ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయిన మార్గాల్లో అదనంగా సిటీ బస్సులు నడుపాలని అధికారులు నిర్ణయించారు. కేశవగిరి నుంచి బోరబండ వరకు (22), సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ (54), సికింద్రాబాద్ నుంచి బోరబండ (16), చాంద్రాయణగుట్ట నుంచి పటాన్‌చెరు (108), సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు (84) వరకు అదనపు బస్సులు నడుస్తాయని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపిన విషయం తెలిసిందే.