పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల బెడద కిందిస్థాయి కార్యకర్తలకు ఇబ్బందులు తెచ్చి పెడుతోందట. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెలు జడ్పీటీసీ గంటా రాములు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీ వేరు కుంపటి పెట్టేశారు. దీంతో ఎవరి వైపు వెళ్లాలో కాంగ్రెస్ శ్రేణులకు అర్థం కావడం లేదట. రాజకీయంగా విజయ రమణారావు, రాములు ఇద్దరు గురు శిష్యులు. గతంలో టీడీపీ ఉన్నవాళ్లే.…
గోషామహల్. హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గాల్లో రాజకీయ వేడి ఎక్కువగా ఉన్న సెగ్మెంట్. గత ఎన్నికల్లో బిజెపి నుంచి రాజాసింగ్ గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు ఇదే. అక్కడ ఓడిన టీఆర్ఎస్లో మాత్రం ఇప్పటికీ సీన్ మారలేదట. ఆ ఎన్నికల్లో నాయకులు ఏవిధంగా అయితే తన్నుకున్నారో.. ఇప్పుడూ అదే పరిస్థితి ఉందట. నేతలు ఎక్కువైపోయారు. కేడర్‌ను పట్టించుకోవడం లేదు. పైగా ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారే…
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వరుసగా చిన్నారులు, అమ్మాయిలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. జూబ్లీ హిల్స్ పబ్ కేసు మరువక ముందే.. హైదరాబాద్‌లో అదే తరహా కేసు ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది… హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గుజరాత్‌కు చెందిన యువతిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్నప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: US Shooting: అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి…
తెలంగాణ ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని చేజిక్కుంచుకొంది. మూడవసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ ప్యాక్‌తో గులాబీపార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆ సంస్థ పలు నివేదికలను టీఆర్ఎస్ పెద్దలకు అందచేస్తోంది. సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించారట. ఆ విషయాలను వడపోసిన తర్వాత టీఆర్ఎస్ వేగంగా చర్యలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది.…
Agnipath Scheme Protest LIVE Updates: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పరిస్థితి చేయి దాటింది. ‘అగ్నిపథ్’ రద్దు చేసి, పాత పద్ధతిలో సైనికుల నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తున్న వేలాది మంది యువకులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను తెలంగాణలోనే కొనసాగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఈ వ్యవహారంలో కేంద్రం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగా కేంద్రం సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించింది. పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఏపీకి కేటాయించడాన్ని తప్పుపడుతూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ లో వారంతా…
అన్నింటికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది.. చిన్నా పెద్ద తేడా లేకుండా ఆధార్ కార్డు చూపించడం, అవసరం అయితే జీరాక్స్ కాపీ ఇవ్వడం జరుగుతోంది.. ఇక, పుట్టగానే ఆధార్ నంబర్ కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.. ఆస్పత్రిలో పుట్టిన వెంటనే ఆ పసికూనలకు ఆధార్ నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్ నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. పైలట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేసింది..…
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్ 13.28 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండలో 12.75, భద్రాది కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 12.28, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 11.90, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 11.13 వర్షపాతం నమోదైంది. జయశంకర్ జిల్లా…
★ నేడు విజయనగరం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు ★ ఏలూరు జిల్లా: నేడు పోలవరం రానున్న సీడబ్ల్యూసీ నిపుణుల బృందం.. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో పనులను పరిశీలించనున్న బృందం ★ నేడు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ★ నేడు బాసరకు వెళ్లనున్న టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.. ట్రిపుల్…