సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను గుర్తించి, 7 మందిని విచారించారు పోలీసులు.. మైనర్ బాలికను తీసుకెళ్లిన బెంజ్ కారును మైనర్ నడిపినట్లు గుర్తించారు. బెంజ్ కారు యజమానిపై కేసు నమోదు moFeki జూబ్లీహిల్స్ పోలీసులు.. అత్యాచారం జరిగిన ఇనోవా వాహనం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్ కారుగా తేల్చారు. డ్రైవర్‌తో పాటు ఇనోవా కారు పంపితే డ్రైవర్‌ను వెనిక్కి పంపి కారును స్వాధీనం చేసుకున్నారు మైనర్లు..
Read Also: Rains: అలెర్ట్.. ఇవాళ, రేపు భారీ వర్షాలు
ఇక, బాలిక గొంతుపై గాట్లు ఉండడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుకు ముందే బంజారా హిల్స్ లోని ఆశ హాస్పిటల్ లో చికిత్స చేయించారు తల్లిదండ్రులు.. తమ కూతురుపైనే ఎవరో అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించి, బాలికను తీసుకెళ్లిన హాదీను ప్రశ్నించారు బాలిక తల్లిదండ్రులు.. బాలికను తీసుకెళ్లింది ఎమ్మెల్యే బంధువు కుమారుడని చెప్పడంతో అసలు విషయం బయట పడింది.. దీంతో నిందితుల తల్లిదండ్రులుకు బాలిక తండ్రి కాల్ చేయగా.. ఎమ్మెల్యే బంధువులు బెదిరింపులకు దిగినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, ఇనోవా కారులోనే బాలికపై ఐదు మంది అత్యాచారం చేసినట్లు భరోసాలో స్టేట్మెంట్ ఇచ్చింది బాలిక. మొత్తంగా ఈ కేసులో రోజుకో వ్యవహారం బయటకు వస్తుంది.