Bandi Sanjay: కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాహితులపై కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జిని ఆయన ఖండించారు. అర్ధరాత్రి సమయంలో గుడాటిపల్లికి వెళ్లి బాధిత నిర్వాసితులను పరామర్శించారు బండి సంజయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులపై మరోసారి లాఠీఛార్జ్ జరిగింది. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు భూ నిర్వాసితులు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. హుస్నాబాద్ బస్టాండ్ దగ్గర్లో ధర్నాకు దిగారు. ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, భూ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘర్షణలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణలో ఏసీపీ కూడా గాయపడ్డారు.
Read Also: Presidential Election: హస్తినలో కీలక మీటింగ్.. ఆసక్తికర చర్చ..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
కాగా, సోమవారం తెల్లవారుజామున గుడాటిపల్లి వాసులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా ఆందోళనలు కొనసాగాయి. తమకు పరిహారం ఇవ్వకుండా సర్వే చేయడానికి వీల్లేదంటూ ఆందోళనలు చేస్తున్న గౌరవెల్లి రిజర్వాయరు నిర్వాసితులపై పోలీసులు బలప్రయోగానికి దిగారు. కరెంట్ సప్లై ఆపేసి, అర్ధరాత్రి ఇళ్లలోకి దూరి ఆందోళనల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఆడ మగా తేడా లేకుండా చావబాదారు. నిర్వాసితులపై పోలీసుల దాడిని నిరసిస్తూ హుస్నాబాద్ బంద్ నిర్వహించింది కాంగ్రెస్. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా బంద్‌లో పాల్గొన్నారు. లాఠీఛార్జిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు జీవన్ రెడ్డి. అటు గౌరవెల్లి నిర్వాసితులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్లిన ఆయన… నిర్వాసితులను కలిసి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!