రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు అవుతుంటాయి. వీటన్నింటిని ప్రజా ప్రతినిధుల కోర్ట్ విచారణ జరుపుతుంటుంది. అయితే తాజాగా ప్రజా ప్రతినిధుల కేసుల విషయంలో కీలక మలుపు ఎదురైంది. ఏకంగా కోర్ట్ 395 కేసుల్లో 380 కేసులను కొట్టేసింది. ఈ కేసుల్లో సరైన ఆధారాలు చూపడంలో పోలీసులు విఫలం అయ్యారని కోర్ట్ కేసులను కొట్టేసింది.
మిగిలిన 14 కేసుల్లో 4 కేసుల్లో శిక్ష.. అలాగే 10 మందికి జరిమానా విధించింది. శిక్ష పడిన వారు హైకోర్ట్ ను ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. ప్రజా ప్రతినిధులపై కేసుల విషయంలో రాష్ట్రంలో పోలీసులు పనితీరు అద్ధం పడుతుందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కామెంట్ చేసింది. కొట్టి వేసిన కేసులలో ఒక్కదానిలో కూడా పోలీస్ శాఖ పై కోర్టుకు అప్పీలు వేయలేదని విమర్శించింది. ఈ దేశంలో ఉన్నవారికి ఒక చట్టం లేనివారికి ఒక చట్టం అని చెప్పకనే చెబుతోందని వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు పూర్తయ్యాయి అని అంటే.. తెలంగాణలో శాసనసభ, పార్లమెంట్ సభ్యులంతా సచ్చీలురని.. ఎటువంటి నేర చరిత్ర లేని వారిగా గుర్తింపపడ్డారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యాఖ్యలు చేసింది.