రాజకీయంగా పోటీని తట్టుకోలేని వారు పార్టీ నుంచి వెళ్లిపోవడం సహజమేనని దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు… అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి వారు పార్టీ నుంచి వెళ్లి పోయినందువల్ల ఎటువంటి నష్టం లేదని అన్నారు. అదే విధంగాతన నియోజకవర్గానికి చెందిన కరకగూడెం…
తెలంగాణలో ఈ మధ్య వరుసగా అమ్మాయిలపై జరుగుతోన్న అఘాయిత్యాలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.. వరుస ఘటనలో వెలుగు చూస్తుండడంతో.. బెంబేలెత్తిపోతున్నారు తల్లిదండ్రులు.. ఇక, ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని ఆగంతకుడు దాడికి ఒడిగట్టాడు. యువతి గొంతు కోసి పరారయ్యారు.. గాయాలపాలైన యువతిని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది.…
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,084 మంది శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 219 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు..
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది. గత సంప్రదాయాలకు అనుగుణంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును రాష్ట్రపతిని చేస్తారని అంతా భావించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన్ని హుటాహుటిన ఢిల్లీ రావాలని చెప్పడం.. ఆ తర్వాత అమిత్ షా తదితరులు వెంకయ్య దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆయనే తదుపది రాష్ట్రపతి అభ్యర్థిగా అందరూ భావించారు. సంఖ్యా పరంగా ఎన్డీయేకు రాష్ట్రపతిని గెలిపించుకునే బలం ఉండటంతో.. చాలా…